21.6 C
India
Wednesday, February 11, 2026
More

    World Cup 2023 : కూల్ కేప్టెన్ ను కలిసిన బీసీసీఐ.. వరల్డ్ కప్ కోసం బిగ్ స్ట్రాటజీ..

    Date:

    World Cup 2023
    World Cup 2023, MS Dhoni, Virat Kohil

    World Cup 2023 : టీం ఇండియా క్రికెట్ మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ గురించి దేశానికే కాదు ప్రపంచానికి కూడా పరిచయం అవసరం లేదు. తన హయాంలోనే క్రికెట్ లో భారతప్రతిష్టను ఖండాంతరాల్లోకి తీసుకెళ్లారు. ఆయనకు ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం యంగ్ క్రికెటర్స్ నుంచి ధోని కంటే సీనియర్ క్రికెటర్ల వరకు ఆయన అంటే చాలా అభిమానం. టీంను ముందుకు నడిపే విధానం.. ఖచ్చితత్వమైన నిర్ణయాలు (DRS) తీసుకోవడంలో ఎంపైర్ కంటే పై స్థాయిలో ఉంటారు ఆయన.

    టీం ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు ధోని. 2007 టీ 20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ షిప్ ట్రోఫీలను అందించి చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణ అక్షరాలను లిఖించుకున్నారు ఆయన. రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత (2013) నుంచి ఇప్పటి వరకు (2023) వరకు టీం ఇండియాకు ఒక్క ఐసీసీ టోర్నీ కప్ రాలేదు. దీన్ని బట్టి చూస్తే మనకు ధోని కెప్టెన్సీ, ఆయన నిర్ణయాలు, ఆయన అనుభవాల గురించి స్పష్టంగా అర్థం అవుతుంది. వికెట్ల వెనుక (వికెట్ కీపర్) ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించే ధోనీ స్టంప్ అవుట్ చేయడంలో మహాధిట్ట. సెకండ్ల వ్యవధిలోనే ఎంతో మందిని పెవిలియన్ కు పంపాడు. ఇక వికెట్ల వెనకాలే ఉంటూ కూడా బౌలర్లకు సలహాలు ఇస్తూ జట్టును ఎలాగైనా విజయతీరానికి చేరుస్తాడు.

    అయితే బీసీసీఐ ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో టీం ఇండియా మెంటార్ గా ధోనీని నియమించాలని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీ-20 వరల్డ్ కప్ సమయంలో కూడా టీం ఇండియాకు మెంటార్ గా ధోనీ వ్యవహరించారు. అప్పుడు మంచి విజయాలనే నమోదు చేసింది ఇండియా జట్టు. ఈ సారి వరల్డ్ కప్ ఇండియాలో జరుగనుంది. ఈ సారి ఎలాగైనా కప్పును చేజిక్కించుకోవాలని బీసీసీఐ పధకం వేసింది. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి ధోనీ కూడా ఒకే చెప్పాడట. ఇక త్వరలోనే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MS Dhoni : ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌పై క్లారిటీ!

    MS Dhoni : ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలకు...

    Hardik Pandya : తొలి టీ20లో హార్దిక్ పాండ్యా ఆటిట్యూడ్.. నోరెళ్ల బెట్టిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్

    Hardik Pandya : ఆదివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20...

    Chris Gayle : టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే.. వాళ్లు కూడా ఓకే : క్రిస్ గేల్..!

    Chris Gayle : గ్రేట్ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ టీమిండియా...