31 C
India
Monday, May 20, 2024
More

    Best Budget Cars : రూ.5 లక్షల్లో మంచి కారు ఇదే.. టాప్-8 మోడల్స్ ను చూడండి..

    Date:

    Best Budget Cars
    Best Budget Cars

    Best Budget Cars : ఇప్పుడు కారు అనేది ప్రతీ మధ్య తరగతి కోరుకుంటుంది. ఇద్దరు పిల్లలు, భార్య, భర్తలు బయటకు వెళ్లాలంటే కారు కావాల్సిందే. బైక్ పై కొంచెం దూరం వెళ్లాలన్నా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్ లో మంచి కారు కోసం వెతుకుతుంటారు. ఇప్పుడు రేట్ల పరంగాచూసుకుంటే బైకుకే దాదాపు రూ. 2 లక్షల వరకు అవుతుంది. దీంతో పోల్చుకుంటే కారు రేటు కూడా పెరుగుతుందని కాబట్టి రూ. 8 లక్షల వరకు అవుతుంది. కానీ రూ. 5 లక్షల్లోనే బ్రాండెడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

    1. మారుతీ Alto K10 ఫీచర్స్
    మారుతి సుజుకీ వారి ఆల్టో కే10 అనేది బడ్జెట్ఫ్రెండ్లీ కారు. ధర రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇందులో 1.0 లీటర్పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.65.7 bhp పవర్, 89 Nm టార్క్ జనరేట్ చేయగలదు. పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజిన్ వేరియంట్ కూడా లభిస్తుంది. ఇక మైలేజ్ చూస్తే వేరియంట్లను బట్టి 24.39 kmpl నుంచి 33.85 km/kg ఉంటుంది. హెవీ ట్రాఫిక్లోనూ ఈజీగా హ్యాచ్బ్యాక్కారును డ్రైవ్ చేయవచ్చు.

    2. మారుతీ Alto..
    మారుతి ఆల్టో ధర రూ.3.54 లక్షల నుంచి రూ.5.13 లక్షల రేంజ్లో ఉంటుంది. ఇక కారులో 796 సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ఉంటుంది. దీనితో పాటు సీఎన్జీ ఆప్షన్ ఇచ్చారు. మైలేజ్ఆయా వేరియంట్లను బట్టి 22.05 kmpl నుంచి 31.59 km/kg వరకు ఉంటుంది. ఇది 5 వేరియంట్లలో, 4 కలర్ఆప్షన్లలో లభిస్తుంది.

    3. రెనాల్ట్ Kwid
    రెనాల్ట్ కంపెనీ వారి రెనో క్విడ్ ధర రూ.4.69 లక్షల – రూ.6.44 లక్షల రేంజ్లో లభ్యమవుతుంది. హ్యాచ్బ్యాక్లో లీటర్సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజిన్ను ఇందులో అమర్చారు. మైలేజ్ ను పరిశీలిస్తే21.46 kmpl నుంచి 22.3 kmpl ఉంటుంది. కారు 11 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది. మారుతీ ఆల్టో కే10, మారుతీ సెలెరియో, మారుతి స్విఫ్ట్‌తో నేరుగా పోటీపడుతుంది.

    4. మారుతీ S-Press
    మారుతి ఎస్-ప్రెస్సో కారు ధర రూ.4.26 లక్షల నుంచి రూ.6.11 లక్షల వరకు దొరుకుతుంది. లీటర్పెట్రోల్ ఇంజిన్, సీఎన్జీ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ అయితేమైలేజీ 24.02 kmpl , సీఎన్‌జీ వేరియంట్ అయితే మైలేజీ 32.73 km/kg కలిగి ఉంటుంది. ఈ కారు 8 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది.

    5. బజాజ్ Qute
    బజాజ్ కంపెనీ వారి క్యూట్కారు ధర రూ. 3.60 లక్షల వరకు ఉంటుంది. ఇందులో 216 సీసీ సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఈ సీఎన్‌జీ హ్యాచ్బ్యాక్5500 rpm వద్ద 10.8 bhp పవర్ జనరేట్ చేయగలదు. దీని బూట్స్పేస్20 లీటర్లు. ఈ క్యూట్సింగిల్వేరియంట్లో, 3 కలర్లలో లభిస్తుంది.

    6. పీఎంవీ EaS E
    పీఎంవీ Eas E కారు ధర రూ.4.9 లక్షలు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్2 సీటర్హ్యాచ్బ్యాక్కారులో 10 కిలో వాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఫుల్ఛార్జి చేస్తే, 160 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారులోని ఇంజిన్ 13.41 bhp పవర్, 50 Nm టార్క్ జనరేట్ చేయగలదు. ఇది సింగిల్ వేరియంట్లో, 5 కలర్లలో లభిస్తుంది.

    7. స్ట్రోమ్ మోటార్స్ R3
    స్ట్రోమ్ మోటార్స్R3 అనేది 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు. దీని ధర సుమారుగా రూ.4.50 లక్షల వరకు ఉంటుంది.
    ఫుల్ ఛార్జ్చేస్తే, 200 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. దీనిలోని ఇంజిన్20.11 bhp పవర్, 90 Nm టార్క్ జనరేట్ చేయగలదు. దీని బూట్ స్పేస్ 300 లీటర్లు. హెవీ లగేజ్ను కూడా చాలా ఈజీగా తీసుకెళ్లగలదు. ఇది సింగిల్ వేరియంట్లో, 4 రంగుల్లో లభిస్తుంది.

    8. మారుతీ Alto 800 Tour
    మారుతి ఆల్టో 800 టూర్ హెచ్1 అనేది 5 సీటర్కారు. దీని ధర  సుమారుగా రూ.4.20 లక్షలు ఉంటుంది. దీనిలో796 సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్అమర్చారు. మైలేజ్22.05 kmpl. ఇది సింగిల్ వేరియంట్లో, మూడు రంగుల్లో లభిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related