35.8 C
India
Monday, May 20, 2024
More

    Budget Cars : తక్కువ బడ్జెట్ లో బెస్ట్: ఈ సంవత్సరం మార్కెట్లోకి రానున్న కార్లు ఇవే..

    Date:

    Budget Cars
    Best Low Budget Cars

    Budget Cars : కారు మధ్య తరగతికి కనీస అవసరంగా మారింది. దీంతో తక్కువ బడ్జెట్ కార్ల కోసం ఇంటి యజమానులు గాలిస్తున్నారు. వారికి ఆయా కంపెనీలు ప్రొవైడ్ చేసే కార్ల మోడల్స్,  ఇచ్చే ధరలు, అందులో ఉండే ఫీచర్స్ కోసం ఎక్కడెక్కడో వెతుక్కోకుండా జై స్వరాజ్య మీ కోసం అన్నింటికి ఒకే వద్దకు చేర్చింది. వీటిలో మీకు కావాల్సింది సెలక్ట్ చేసుకోండి.

    మధ్య తరగతి వారు తక్కువ ధరలోనే కారు కావాలని చూస్తారు. వారి ఆలోచనలు, వారి బడ్జెట్ కు అనుగుణంగా 2024లో రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో దొరికే టాప్ 5 కార్లను ఇక్కడ చూద్దాం.

    KIA సోనెట్ ఫేస్ లిఫ్ట్..
    దక్షిణ కొరియా ఆటో మేకర్ కియా 2024 జనవరిలో సోనెట్ ఫేస్ లిఫ్ట్ ను ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. అయితే ఈ కారును పొందాలని అనుకుంటే ఆన్‌లైన్‌లో లేదంటే అధీకృత డీలర్‌షిప్‌లో రూ. 20 వేలు టోకెన్ చెల్లించి బుక్ చేసుకోవాలి. దీని ప్రారంభ ధర రూ. 8 లక్షలు, మిడ్, హై-స్పెక్ వేరియంట్‌ ధర మాత్రం రూ. 10 లక్షల కంటే ఎక్కువగా ఉండనుంది. గత మోడల్‌తో పోలిస్తే భారీగానే మార్పులు చేసింది. ఇంజిన్ ఎంపికలు అలాగే ఉంటాయి.

    ఆల్-న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్..
    మారుతీ సుజుకీ 2024 మొదటి త్రైమాసికంలో స్విఫ్ట్  హ్యాచ్ బ్యాక్ ను ఇండియా మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ మోడల్ ‘హార్ట్ టెక్’ ప్లాట్ ఫారం ఆధారంగా రూపొందించారు. ఫ్రెంట్ లో మారుతీ సుజుకీ, బ్యాక్ బెలనో లాగా డిజైన్ ను మార్చారు. ఇక, ఇంటీరియర్ కూడా కొత్తదే. ఇది పెట్రోల్, హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది.
    1.2L DOHC ఇంజిన్‌ కలిగి ఉంది. 82bhp శక్తిని, 108Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలో 5-స్పీడ్ మాన్యువల్, కొత్త CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఏర్పాటు చేశారు. ధర రూ. 10 లక్షల లోపు ఉండబోతుందని తెలుస్తోంది.

    న్యూ మారుతి డిజైర్..
    మారుతి సుజుకి కొత్త తరం డిజైర్ సబ్-4 మీటర్ సెడాన్‌ను కూడా 2024 రెండో త్రైమాసానికి ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ స్విఫ్ట్ డిజైన్, ఇంటీరియర్ అప్‌డేట్లను హ్యాచ్‌బ్యాక్‌తో పంచుకుంటుంది. ఈ సెడాన్ మాన్యువల్, ఆటో మెటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో హైబ్రిడ్ టెక్నాలజీతో 1.2L 3-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇక దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

    TATA ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్..
    టాటా మోటార్స్ లో ఆల్ట్రోజ్ కు క్రేజ్ ఎక్కువ. అయితే ఇందులో కొంచెం అప్ డేట్ చేసి కొత్త మోడల్ ను 2024లో రిలీజ్ చేయనుంది కంపెనీ. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను కలిగి ఉంది. ఇందులో అనేక కొత్త ఫీచర్లను పొందుపరిచారు. రేసర్ ఎడిషన్ 120bhp, 1.2L టర్బో పెట్రోల్ ఇంజిన్, కొత్త 125bhp, 1.2L డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ అమర్చే అవకాశం ఉంది. దీని ధర రూ. 10 లక్షల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.

    నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్..
    నిస్సాన్ 2024 రెండో త్రైమాసికంలో మాగ్నైట్ సబ్-4 మీటర్ SUVకి ప్రధాన అప్‌డేట్‌ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ అందిస్తుంది. కంపెనీ కొత్త మాగ్నైట్‌ను మెక్సికో వంటి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ (LHD) మార్కెట్లకు కూడా ఎగుమతి చేయడం ప్రారంభిస్తుంది. ఈ చిన్న SUV డిజైన్‌లో మార్పులు చేసి ఫీచర్స్ జోడించి, ఇంటీరియర్ ను కూడా మార్చి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారుగా రూ. 10 లక్షల వరకు ఉండవచ్చు.

    Share post:

    More like this
    Related

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related