31 C
India
Thursday, May 16, 2024
More

    Chandranna Gifts : ఐటీడీపీకి చంద్రన్న కానుకలు..!

    Date:

    Chandranna gifts
    Chandranna gifts

    Chandranna gifts to ITDP : మరో 9 నెలల్లో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలనుక్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ iTDP (డిజిటల్) విభాగం కార్యకర్తలతో సమావేశమై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఐటీడీపీ కార్యకర్తలకు ఫోన్‌లే ఆయుధాలని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పడంలో ముందుండాలని సూచిస్తున్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పుడు వాగ్దానాలను నమ్మి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారని, వాగ్దానాల అమలుపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, వైఎస్సార్‌సీపీని కనుమరుగు చేయాలని కార్యోన్ముఖులను చేస్తున్నారు.

    సెల్ విప్లవం మనదే..

    సెల్ ఫోన్ టెక్నాలజీ విప్లవానికి టీడీపీ శ్రీకారం చుట్టిందని, దీనిని కార్యకర్తలు విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. టీడీపీ మహానాడు లో ప్రకటించిన మినీ మేనిఫెస్టో జనాల్లోకి వెళ్లడానికి ప్రధాన కారణం ఐటీడీపీనే. ప్రతీ కార్యకర్త ఈ మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికీ చేరవేస్తున్నారు. ఇదంతా ఐటీడీపీ కార్యకర్తల విజయమే. సెల్‌ఫోన్లతో ప్రపంచాన్ని జయించిన ఇన్ఫర్మేషన్-టీడీ (ఐ-టీడీ) కార్యకర్తలను తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతూ ఐ-టీడీ కార్యకర్తలు చాలా వేగంగా సమాచారం చేరవేస్తున్నారు.

    Chandranna gifts to ITDP
    Chandranna gifts to ITDP

    ప్రతి వ్యక్తి ఐటీ ఆయుధంగా మారాలని పిలుపునిచ్చారు.  సోషల్ మీడియాను విరివిగా వినియోగించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కార్యకర్తలకు సూచించారు. ఐటీడీపీ విభాగం ఏర్పాటుతో టీడీపీ ప్రజల మద్దతు సమీకరించుకోగలుగుతున్నది. రానున్న రోజుల్లో ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వారందరికీ స్మార్ట్ వాచ్ లు గిఫ్ట్  గా ఇచ్చారు. వారి సేవలను అభినందించారు. ఐటీడీపీ సాధిస్తున్న విజయాలను వివరిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇదే ఉత్సాహంతో పని చేస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలో వస్తుందని చెబుతున్నారు. ఐటీడీపీ కార్యక్రమాలతో ప్రభుత్వ అవినీతి ప్రజలకు పూర్తిస్థాయిలో అర్థమవుతున్నదని, అధికార పార్టీని వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వ అక్రమాలను డిజిటల్ వింగ్ ద్వారా ఎప్పటికప్పడు ఎండగట్టాలని దిశానిర్దేశం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP Second List : రేపు టీడీపీ రెండో జాబితా.. బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

    TDP Second List : ఏపీలో ఎటూ  చూసినా ఎన్నికల కోలాహలమే...

    AP Elections 2024 : శ్రీకాకుళం టు అనంతపురం.. ఏపీలో గెలుపు ఎవరిదంటే? ఒక సంస్థ సర్వేలో సంచలన విషయాలు

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు...

    Prashant Kishore : చంద్రబాబు తో ప్రశాంత్ కిషోర్ భేటీ – కీలక సూచనలు, మార్పులు..!!

    Prashant Kishore : ఏపీలో ఎన్నికలు పార్టీల అధినేతలకు ప్రతిష్ఠాత్మ కంగా మారుతున్నాయి....

    Chandrababu Comments : కుట్రలకు, దారుణాలకు అద్దం పట్టిన సినిమా ఇది.. ఇక ఆయన సినిమా ఖతం: చంద్రబాబు

    Chandrababu Comments Viral : జగన్ రెడ్డికి అసలు సినిమా ఇప్పుడు మొద...