
చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది.. ఆయన అనుకరించే పెద్ద నటుడు కాదని పృథ్వీ సైతం తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తాజాగా పృథ్వీ మరో వీడియో రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసారు.. శ్యామ్ బాబు పాత్ర రాజకీయ వివాదానికి కారణం అయిన విషయం విదితమే.. అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో వేసిన డాన్స్ ను అనుకరిస్తూ పృథ్వీ ఈ పాత్ర చేసారని వివాదం మొదలయ్యింది.
ఈ వివాదం కొనసాగవుతుండగానే శోభన్ బాబు పేరుతొ పృథ్వీ రాజ్ కు మరో బంపర్ ఆఫర్ రాగా ఈ కొత్త సినిమాలో శ్యామ్ బాబు పాత్రను ఏకంగా రెండు గంటలు ఉండనుంది.. బ్రో సినిమాలో 1 నిముషం 5 సెకన్ల పాత్ర ఉంటే కొత్తగా చేయబోయే శోభన్ బాబు సినిమాలో మాత్రం రెండు గంటలు ఉంటుందని చెప్పుకొచ్చారు..
ఇది తన కెరీర్ ను మలుపు తిప్పే అద్భుతమైన అవకాశం అని అంటున్నారు.. డైరెక్టర్, ఏ బ్యానర్ లో సినిమా చేస్తున్న వంటి వివరాలన్నీ అతి త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. సెల్ఫీ వీడియోను రిలీజ్ చేస్తూ ఈ శ్యామ్ బాబు ను కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు పృథ్వీ.. మరి ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో చూడాలి..