Chiranjeevi : ‘భోళా శంకర్’ చిత్రం రిలీజింగ్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానులలో సినిమా పై ఉన్న ఆసక్తి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి మెహర్ రమేశ్ దర్శకత్వం ను వహించాడు. ఇతని దర్శకత్వం లో గత పది సంవత్సరాలుగా ఏ సినిమా రాకపోవడం కూడా చిరు ఫ్యాన్స్ ను కొంత కలవరపెడుతుంది. అందులోనూ ఇది తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్. ఈ రెండు కారణాల వల్ల ఫ్యాన్స్ లో ఊపు తగ్గిందని సినీ వర్గాల అభిప్రాయం.
మెగాస్టార్ చిరు సతీసమేతంగా నిన్న(09 అగస్ట్) రాత్రి “భోళా శంకర్” మూవీ ఫైనల్ కాపీని స్పెషల్ షో లో చూశారు. ఫైనల్ కాపీ చూసిన తర్వాత సినిమా అవుట్‌పుట్ చిరు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అభిమానులకు కొంత ఊరటనిచ్చే అంశం.
ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా ఉంది. కీర్తి సురేష్ పాత్రతో కూడిన చివరి 45 నిమిషాలు అద్భుతంగా వచ్చాయి. అలాగే సినిమాలో ఎలాంటి సాగదీత లేదు. సందర్భానికి అనుకూలంగానే అన్ని పాటలు ఉన్నాయి. ఇందులో తన పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని మెగాస్టార్ చెప్పారు. ప్రస్తుతం మ్యూజిక్ ట్యూన్‌లు అంతగా ఆకట్టుకోనప్పటికీ, పాటల ఆడిటోరియం ప్రభావం ఉత్సాహంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుందని చెప్పారు. ఫైనల్ కాపీని చూస్తే మెహర్ రమేష్ పడిన కష్టాన్ని చిరు మెచ్చుకున్నట్లు సమాచారం.
ఈ సంవత్సరం ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’ మొదటి రోజు ఫస్ట్ షోకి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే ‘భోళా శంకర్’ కూడా అభిమానుల అంచనాలను అందుకుంటుందని పలువురు ఆశిస్తున్నారు. ఎప్పటిలాగే చిరు మేనియా తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని సినీ దిగ్గజాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.