38.7 C
India
Saturday, May 18, 2024
More

    Constitution Day : రాజ్యాంగం రోజు – కొన్ని ప్రశ్నలు..

    Date:

    Constitution Day
    Constitution Day, India

    Constitution Day : స్వతంత్ర భారత దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా కుల రాజకీయాలు, కుల ప్రాసంగికత, వక్రత, నిజాల్ని దాచడం వంటి వాటికి అతీతంగా ఇకనైనా ఈ దేశ ప్రజకు రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలకు సరైన జవాబులు కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికి ఇప్పటికైనా జవాబుదారీ తనం కావాలి.

    1. మన దేశ రాజ్యాంగానికి అంబేడ్కర్ మాత్రమే పుర్తిగా కర్త అవుతారా?

    2. మన దేశ రాజ్యాంగానికి ఆధార రచన లేదా మూల రాజ్యాంగాన్ని రాసింది బెనగాల్ నరసింహారావు. ఆయన 1946లో మొదలు పెట్టి, (జర్మనీ ఇంకా కొన్ని ఇతర దేశాల రాజ్యాంగాల్లోని అంశాల్ని తీసుకుని )1948లో మన దేశ మౌలిక లేదా ఆధార రాజ్యాంగాన్ని పూర్తి చేశారు. అటు తరువాత అది అంబేడ్కర్ అధ్యక్షుడుగా ఉన్న 8 మంది సభ్యుల కమిటికి వెళ్లింది. ఆ బెనగాల్ నరసింహారావుకు రాజ్యాంగ రచన విషయంలో ఎందుకు దక్కవలసిన గుర్తింపు, స్థానం దక్కడం లేదు? ఈ అన్యాయం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?

    3. రాజ్యాంగం విషయంలో బెనగాల్ నరసింహారావును మరుగుపరచడం ఏ కుట్రలో భాగం?

    4. రాజ్యాంగం రచనపరంగా 20కు పైగా కమిటీలు, ఆ కమిటీల అధ్యక్షుల భాగస్వామ్యం, వాళ్ల సేవలు ఎందుకు దాచెయ్యబడ్డాయి? దాచెయ్యబడుతున్నాయి?

    5. రాజ్యాంగం రచనపరంగా 20కు పైగా కమిటీలు, ఆ కమిటీల అధ్యక్షుల భాగస్వామ్యం లేకుండానే లేదా మరెవ్వరూ లేకుండా రాజ్యాంగం మొత్తం అంబేడ్కరే రాయడం విదూషకత్వం అవదా?

    6. రాజ్యాంగం ఏ ధార్మిక నియమావళి గ్రంథమో, చరిత్ర గ్రంథమో కాదు కదా? అలాంటప్పుడు రాజ్యాంగం ప్రతిలో రాముడు, అర్జునుడు, బుద్ధుడు, మహావీరుడు, అక్బర్, టిప్పు సుల్పాన్, అశోకుడు, కృష్ణుడు చిత్రాల్ని పొందుపరచడం దేన్ని సూచిస్తుంది?

    7. లౌకిక మేధావి అంబేడ్కర్ రాముడు, కృష్ణుడు, అర్జునుడు, మహావీరుడు, బుద్ధుడు వంటి మత చిహ్నాల్ని లౌకిక రాజ్యాంగంలో చోటివ్వడంలోని ఆంతర్యం ఏమిటి?
    (బుద్ధుడు మత చిహ్నం అవని పక్షంలో ప్రపంచంలో ని పలు దేశాల్లో ఉన్న బౌద్ధ మతం ఉండడం అబద్ధం అవుతుంది)

    8. టిప్పు సుల్తాన్, అశోకుడు, అక్బర్ వంటి చారిత్రిక చిహ్నాలు రాజ్యాంగంలో ఎందుకు ఉండాలి?

    9. మానవ హక్కుల ధీమంతుడు అంబేడ్కర్‌కు అశోకుడు మానవ హక్కుల్ని దారుణంగా కాలరాచేసిన యుద్ధోన్మాది అన్న చారిత్రిక సత్యం తెలుసుకోగలిగిన చదువు లేదా? అశోకుడు బుద్ధావలంబకుడు అయ్యాకే భయంకరమైన కళింగ యుద్ధం జరిగింది అన్నది సరైన చరిత్ర. అశోకుడు తాను రాజయ్యేందుకు తన సోదర, బంధువుల్ని నిర్మూలించాడు. మన దేశంలో తొలి మతన్మాద నరమేధం జరిపించింది అశోకుడే! కళింగ యుద్ధం తరువాతి కాలంలో తన రాజ్యంలోని ఆజీవిక మతస్థుల్ని, నిర్గ్రంధుల్ని ఊచ కోత కోయించాడు అశోకుడు. అంతర్జాతీయ చరిత్ర పరిశోధకులు ఈ సత్యాల్ని విశ్వవ్యాప్తంగా తెలియ జేశారు. అంబేడ్కర్‌కు సరైన చరిత్ర తెలియదా? ఆ అశోకుడికి రాజ్యాంగ ప్రతిలో స్థానం ఇవ్వడంలో అంబేడ్కర్ ఉద్దేశ్యం ఏమిటి?

    10. అక్బర్, టిప్పు సుల్తాన్ వంటి వాళ్లు మన దేశాన్ని పీడించిన లేదా పాలించిన విదేశీ మత రాజులు. స్వతంత్ర దేశ రాజ్యాంగంలో వీళ్లకు చోటు ఎందుకు? వీళ్లకు రాజ్యాంగంలో చోటివ్వడం ద్వారా దేశ ప్రజలకు అంబేడ్కర్ ఇస్తున్న సందేశం ఏమిటి?

    11. మహావీరుడి ధ్యానం, బుద్ధుడి బోధి, అర్జునుడి తపస్సు, కృష్ణుడి భగవద్గీతా బోధ వంటివి లౌకికత్వానికి, రాజ్య పాలనకు సంబంధించినవా? ఈ చిత్రాల్ని లౌకిక మేధావి అంబేడ్కర్ రాజ్యాంగం ప్రతిలో ఎందుకు పెట్టారు?

    12. ఈ చిత్రాలు రాజ్యాంగంలో ఉండడానికి అంబేడ్కర్ కారణం కాదా? ఆయన బాధ్యత లేదా? ఇతరులు అందుకు కారణమై ఉంటారా? వీటి ఆధారంగానూ రాజ్యాంగ నిర్మాణంలో ఇతరులు పలువురి కృషి ఉంది అని మనం రూఢీ చేసుకోవచ్చా?

    13. లౌకిక మేధావి అంబేడ్కర్ రాముడు, కృష్ణుడు, అర్జునుడు వీళ్లను చారిత్రిక వ్యక్తులుగా గుర్తించారా? బుద్ధడు, మహావీరుడు చారిత్రిక వ్యక్తులూ, మత వ్యక్తులూ అయినట్టుగా రాముడు, కృష్ణుడు, అర్జునుడు వీళ్లను కూడా అంబేడ్కర్ పరిగణించారా?
    రామాయణం, భారతం, భాగవతం నిజంగా జరిగిన చరిత్రలు అని అంబేడ్కర్ విశ్వసించి పరిగణించారా?

    14. క్రైస్తవం, ఇస్లామ్, కమ్యూనిజమ్ వీటిని అంబేడ్కర్ నిరసించడమూ, తిరస్కరించడమూ అవి దేశానికి హానికరం అని చెప్పడం మనం చదివాం; అందువల్లే రాజ్యాంగంలో వాటికి సంబంధించిన చిత్రాలు లేవా? (అక్బర్, టిప్పు సుల్తాన్ చారిత్రిక రాజుల చిత్రాలు)

    15. నంది, నటరాజు చిత్రాలు రాజ్యాంగంలో ఉన్నాయి. అవి మత పరమైన చిహ్నాలే. “నేను హిందువుగా మరణించను” అని అన్న లౌకిక మేధావి అంబేడ్కర్
    ఈ హిందూ మత చిహ్నాల్ని రాజ్యాంగంలో పొందుపరచడం ఏమిటి?

    16. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 3యేళ్ల తరువాత అంబేడ్కర్ తాను రాసిన రాజ్యాంగాన్ని తానే ఎందుకు తీవ్రంగా వ్యతిరేకించాడు? లేదా అంబేడ్కర్ అలా వ్యతిరేకించనే లేదా?

    17. రాజ్యాంగం విషయంలో ఒక దశలో అంబేడ్కర్ “I am quite prepared to burn it; I dont want it” అని ఎందుకు అన్నారు? రాజ్యాంగం సరిగ్గా లేదనో సరికాదనో, సరిగ్గా అమలు కావడం లేదనో, అప్పటి కాంగ్రెస్ పాలకులవల్ల సరిగ్గా అమలు అవదనో అలా అన్నారా? అసలు అలా అనలేదా?

    18. దేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని రాసిన మహా మేధావి, లౌకిక శిఖరం, దార్శనికుడు, సంస్కర్త, అయిన అంబేడ్కర్, మంత్రిగా పని చేసి కూడా ప్రజాభిమానాన్ని చూరగొనలేక ఎన్నికల్లో ఓడిపోవడం ఏమిటి? అంత గొప్ప అంబేడ్కర్‌ను ఈ దేశంలోని పెద్ద శాతం ప్రజలు ఎందుకు ఆమోదించలేదు?

    19. సమతా వాది అయి, కుల నిర్మూలనను కోరుకున్న అంబేడ్కర్ స్వతంత్ర దేశంలో తొలిసారిగా All India Scheduled Castes federation అన్న ‘కులం’ పార్టీ పెట్టడం ఏమిటి? ఆ కులం పార్టీ గెలవలేకపోవడం కాదు కదా ఆ కులం ప్రజలే 90% అంబేడ్కర్ పెట్టిన కులం పార్టీకి ఓటు వెయ్యక పోవడం దేన్ని సూచిస్తోంది? All The Scheduled Castes Of India అంబేడ్కర్‌ను తిరస్కరించిన సత్యాన్ని చరిత్ర మనకు చెప్పడం లేదా?

    20.  అంబేడ్కర్ ఏ విధంగానూ పెద్దగా సఫలం కాలేదు; ఇది దేనికి నిదర్శనం?

    21. బతికి ఉన్నంత వరకూ అన్ని విధాలుగానూ తీవ్ర నిరాదరణ గురై, ప్రజలపై, పెద్దగా ప్రభావం చూపించలేని అంబేడ్కర్ పేరు మీద గత కొన్ని దశాబ్దులుగా దేశంలో ఎందుకు హడావిడి జరుగుతోంది? అంబేడ్కర్ ఆధారంగా, అంబేడ్కర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా దేశ సామాజిక సామరస్యాన్ని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందా?

    22.  బతికి ఉండగా దేశ ప్రజల తిరస్కారాని గురై పనికిరాకుండాపోయిన అంబేడ్కర్ ఇప్పుడు ఈ ఏ విధంగా ప్రజకు పనికివస్తారు? ఏ సంపాదన కోసం, ఏ లబ్ది కోసం అంబేడ్కరిజమ్, అంబేడ్కరిస్ట్‌స్ జండాలతో రచ్చలు జరుగుతున్నాయి?

    23. అంబేడ్కర్ అనగానే స్ఫురణకు వచ్చేది మన దేశ రాజ్యాంగమే. ఆ రాజ్యాంగానికి ఆధారం బెనగాల్ నరసింహారావు, ఆ తరువాత 200కు పైగా పలువురి కృషి ఫలితం మన ఇవాళ్టి రాజ్యాంగం. పలువురి మేధ, ఆలోచన, కృషి వీటిని అంబేడ్కర్‌కు మాత్రమే ఆపాదించడం దోపిడి కాదా? అన్యాయం కాదా? దారుణం కాదా? ఈ దారుణం ఏ కుట్రలో భాగం?

    24. రాజ్యాంగ నిర్మాణంలో పునాది, కీలకం అయిన బెనగాల నరసింహారావును లేకుండా చేసి రాజ్యాంగ కర్తృత్వాన్ని పూర్తిగా అంబేడ్కర్‌కు అంటగట్టడం గత కొన్ని దశాబుద్దులుగా దేశంలో బలపడుతూ వస్తున్న కులోన్మాద కుట్రలో భాగమా? రాజ్యాంగ నిర్మాణంలో బెనగాల నరసింహారావును లేకుండా చేస్తూండడం కుల వివక్ష కాదా?

    25. రాంజీ మాలోజీ సక్పాల్ కొడుకు భీంరావ్ సక్పాల్, భీంరావ్ అంబేడ్కర్ అయి, చలామణిలోకి వచ్చి, తన జన్మ మతాన్ని వీడి బౌద్ధాన్ని తీసుకున్నాక కూడా ఆ అంబేడ్కర్ అనే బ్రాహ్మణ నామాన్ని వదులుకోకపోవడం దేన్ని తెలియజేస్తోంది? అంబేడ్కర్ బౌద్ధ ‘మతం (లోకి)మారడం’ మతతత్వం కాని లౌకికత్వం అవుతుందా? ఒక మతాన్ని తీసుకున్న ‘అంబేడ్కర్ లౌకిక వాది కాదు’ అన్నది సత్యమేనా?

    అంబేడ్కర్ పేరుతో ఏవో కుట్రలు జరుగుతున్నాయని, అవి దేశానికి హానికరమైనవని ప్రజలు గ్రహిస్తున్నారు. “అంబేడ్కర్, అంబేడ్కర్” అంటూ రచ్చ చేస్తున్నవాళ్లు దేశానికి, సామాన్య పౌరులకు అపాయకరం కానున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    తప్పుడు, కులోన్మాద, కుట్ర పూరిత, సమాజ వ్యతిరేక, అభ్యంతరకరమైన, అవాస్తవ పత్రికా రచనలతో చాల కాలంగా ప్రజల్ని మోసం చేసేందుకు జరుగుతూ వస్తున్న వృద్ధ రచనలు, విష రచనలకు, కాలం చెల్లాల్సిన సమయం ఇది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 75యేళ్ల తరువాతైనా, ఇకనైనా అంబేడ్కర్ చుట్టూ ఉన్న ప్రశ్నలకు సరైన జవాబులు అమలులోకి రావాలి. అవి ఈ దేశానికి మేలు చేస్తాయి.

    – రోచిష్మాన్
    9444012279
    అంతర్జాతీయ కవి, విశ్లేషకుడు, ఆలోచనా శీలి,
    కాలమిస్ట్, జెమలజిస్ట్

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana Shakat :డిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో… తొలిసారి తెలంగాణ శకటం

    దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....

    TLCA : టీఎల్‌సీఏ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు

    తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ) ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సంబురాలు...

    125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

    ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ 132 వ...