Viral Video : బిడ్డకు జన్మనివ్వడం ఏ స్త్రీకైనా పునర్జన్మతో సమానం అంటారు. మహిళ ప్రసవ వేదన అనేది శరీరంలోని 20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో సమానమని చెబుతారు. తన బిడ్డకు ప్రపంచాన్ని చూపించాలంటే తల్లి ఈ బాధను భరించాల్సిందే. మహిళలకు నార్మల్ డెలివరీ చాలా కష్టం. ఆధునిక వైద్య విధానంలో ఈ బాధను తగ్గించే మార్గం ఉంది. నార్మల్ డెలివరీ స్థానంలో ఆపరేషన్ ఆప్షన్ వచ్చింది. ప్రస్తుతం పురిటి నొప్పుడు భరించలేక చాలా మంది గర్భిణులు సిజేరియన్ ని ఆశ్రయిస్తుంటారు. అది కూడా ప్రమాదం తక్కువేమీ కాదు. అందుకే గర్భిణులు ఆపరేషన్ థియేటర్‌కి వెళ్లే వరకు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఆపరేషన్ సమయంలో ఎవరైనా భగవంతుడిని ధ్యాన్నిస్తూ పాట పాడటం మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ, అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన కొందరు మహిళపై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు ఆపరేషన్ థియేటర్లో వీడియో రికార్డు చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఓ ఆపరేషన్ థియేటర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో ఒక మహిళ ఆపరేషన్ టేబుల్‌పై పడుకుని ఉంది. ఆమె చుట్టూ వైద్యులు, నర్సుల బృందం ఉంది. ఆపరేషన్ థియేటర్ లోపల టేబుల్ మీద పడుకున్న నారాయణ నామస్మరణ చేస్తుంది. ఆమె అలా పాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ఎవరో వీడియో రికార్డ్ చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్ల నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.