Alcohol :
మనలో చాలా మందికి మద్యం అలవాటు ఉంటుంది. రోజు ఎంతో కొంత మద్యం తీసుకోకపోతే వారికి మనసున పట్టదు. మందు తాగితేనే ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు. కొందరేమో కొంచెం తాగినా ఊగుతుంటారు. ఏదైనా మద్యపానం హానికరం అంటూ ప్రభుత్వమే సరఫరా చేయడం గమనార్హం. చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం అంటే ఇదేనేమో. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఎవరు పట్టించుకోరు.
మద్యం తాగే సమయంలో రకరకాల తినుబండారాలు తీసుకుంటూ ఉంటారు. వీటితో కూడా ప్రమాదకరమే. కానీ ఎవరు వింటారు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా వినే పొజిషన్ లో ఉండరు. అదో ప్రపంచం. వారి స్టైలే మారుతుంది. మాటతీరు కూడా తేడాగా ఉంటుంది. మద్యం తాగే సమయంలో స్టఫ్ కోసం చాలా మంది వినూత్నంగా ఉండాలని కోరుకోవడం చూస్తుంటాం.
పాల ఉత్పత్తులలో కొవ్వు అధికంగా ఉంటుంది. మద్యం తాగేటప్పుడు వాటి జోలికి వెళ్లకపోవడమే బెటర్. అందులో కొవ్వు ఉండటం వల్ల మద్యం తాగేటప్పుడు వాటిని తీసుకోవద్దు. ఇంకా కొందరైతే బ్రెడ్, బియ్యం వంటి వాటితో చేసినవి తీసుకుంటారు. ఇందులో కార్బోహైడ్రేడ్లు పుష్కలంగా ఉవి మధుమేహం రావడానికి కారణమవుతాయి. మద్యం సేవించే వీటిని తీసుకోవడం కూడా మంచిది కాదు.
ఇంకా కొందరైతే మాంసం తింటూ ఉంటారు. ఇది కూడా డేంజరే. మాంసం గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు రావడానికి ప్రేరేపితంగా నిలుస్తుంది. అందుకే మందు తాగేటప్పుడు దీని జోలికి వెళ్లడం అంత సమంజసం కాదు. కూల్ డ్రింక్స్ కూడా తీసుకుంటారు. దీంతో కూడా ప్రమాదమే. ఇందులో కూడా అల్కహాల్ ఉంటుంది. అందుకే వీటిని తీసుకోవడం అంత సురక్షితం కాదు.
వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇందులో కూడా మధుమేహం రావడానికి కారణమయ్యే కారకాలు ఉండటం వల్ల వీటిని తీసుకుంటే ముప్పే. గుండె జబ్బులు రావడానికి కారణాలుగా నిలుస్తాయి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం కూడా కరెక్టు కాదు. మద్యం సేవించే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మన ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే అని గుర్తుంచుకోవాలి.