31.6 C
India
Sunday, May 19, 2024
More

    Alcohol : మద్యం తాగేటప్పుడు ఇవి తీసుకుంటే ఆరోగ్యమే తెలుసా?

    Date:

    Alcohol :

    చాలా మంది మద్యం సేవించే అలవాటుకు దగ్గరవుతున్నారు. అల్కహాల్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. దీంతో జీర్ణ సమస్యలు, డీ హైడ్రేషన్, గుండె, కిడ్నీలకు ప్రమాదం ఏర్పడుతుంది. కానీ మద్యం అలవాటు మాత్రం మానడం లేదు. మద్యం తాగే ముందు గుడ్డు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అరటి పండు తింటే కూడా మంచి లాభాలే ఉంటాయి. కానీ ఇలాంటివి తినరు. నాన్ వెజ్ తీసుకోవడానికే ఇష్టపడతారు. చికెన్, మటన్, చేపలు వంటివి ఎక్కువగా తింటుంటారు.

    మద్యం తాగే సమయంలో చియా సీడ్స్ తీసుకుంటే మంచి ప్రయోజనాలు దక్కుతాయి. అవకాడో తీసుకుంటే మంచి లాభాలుంటాయి. చేపలు తీసుకుంటే ఒమేగా 3 యాసిడ్స్ అందుతాయి. పెరుగు తాగితే కూడా జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేడ్లు ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టమాట, ఓట్స్ , చిలగడ దుంప వంటివి తీసుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి.

    మద్యం తాగేటప్పుడు జీర్ణం కాకుండా ఉండేవి తినడం కంటే తేలిగ్గా అరిగేవి తింటే ఎంతో మంచిది. కానీ ఎవరు వింటారు. ఏం కాదనే నిర్లక్ష్యంతోనే ఉంటారు. వారి శరీరానికి పడకపోయినా వాటినే తింటుంటారు. కడకు అనారోగ్యానికి దగ్గరవుతారు. ఏవి తినాలో ఏవి మానాలో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

    మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని బాటిళ్ల మీద లేబుల్ వేసి మరీ అమ్ముతున్నారు. ఈ విషయం తెలియక తాగడం లేదు. తెలిసే వారి బలహీనతను బయటపెట్టుకుంటున్నారు. ఫలితంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. మద్యానికి వీలైనంత వరకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మద్యం అలవాటు మంచిది కాదని తెలుసుకుని ప్రవర్తిస్తే కష్టాలు రావు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Liquor : మద్యం షాపులపై ఆంక్షలు సరే..మరి బ్లాక్ మార్కెట్?

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలకు ముందు జగన్...

    Alcohol : మందులో ఎంత వాటర్ కలపాలో తెలుసా? 99.9 శాతం మంది చేసేది తప్పేనట!

    Alcohol : మందు బాబులకు అత్యంత ఎక్కువ ఇష్టమైనది ‘విస్కీ’. ఎందుకంటే...

    Alcohol Prices : ఏ రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉంటాయో తెలుసా?

    Alcohol Prices : మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్...

    Alcohol : ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే మందు మానేయండి లేదంటే?

    Alcohol : మద్యం అనేది ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి హానికరమే కానీ.....