Sitting Work : ఈ రోజుల్లో అందరు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో అనారోగ్యాలు దరి చేరుతున్నాయి. రోజులో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పలు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సగటున ఒక్కొక్కరు సుమారు 9.30గంటల పాటు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు. కూర్చోవడం కంటే పడుకోవడమే మేలు. లేదంటే నిలబడటం మంచిది. కానీ కూర్చోవడం సురక్షితం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యూరోపియన్ హార్డ్ జర్నల్ లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం పలు వివరాలు వెల్లడిస్తోంది. రోజుకు సగటున చాలా సేపు కూర్చునే వారికి ఇతర వ్యాధులు వచ్చే వీలుందని తెలుస్తోంది. కూర్చునే బదులు నిలబడి ఉన్నా లేదా పడుకుని ఉన్నా మంచిదేనని అంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలామంచి ప్రయోజనాలు దక్కుతాయని ఆ అధ్యయనంలో తేల్చారు.
ఊరకే కూర్చునే బదులు ఓ ఐదు నిమిషాలు శారీరక శ్రమతో కూడిన పని చేసినా మంచి ఫలితాలే వస్తాయి. పరిస్థితుల రీత్యా అందరు కూర్చునే పనులే చేస్తున్నారు. కానీ దీంతో పలు సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈనేపథ్యంలో రోజులో ఎక్కువ సేపు కూర్చోవడం అంత మంచిది కాదు. అనారోగ్యానికి దారి తీస్తుంది. ప్రతి అరగంటకోసారి లేచి అటూ ఇటూ తిరడం మేలు.
కూర్చుని ఉండటం వల్ల డిస్క్ ల మీద ప్రభావం పడుతుంది. గంటకోసారి పడుకుని ఐదు నిమిషాలైన సేద తీరాలి. నిలబడి ఉంటే అటు ఇటు నడుస్తుంటే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇలా మనం రోజులో ఎక్కువ సమయం కూర్చుని ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలుస్తోంది.