
Eating raw vegetables : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకోవాలి. లేకపోతే ప్రాణం నిలవదు. కూరగాయలు వండుకుని తింటాం. కానీ కొందరు మాత్రం పచ్చివే తింటారు. పచ్చివి తినడం వల్ల మనకు నష్టాలే వస్తాయి. ఇటీవల కాలంలో కూరగాయలు పండించాలంటే రసాయనాలు వాడతారు. దీంతో కూరగాయలు పండించే విధానంలోనే ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీంతోనే మనం కూరగాయలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే.
ప్రస్తుతం కూరగాయలను మందులు వేసి పండిస్తున్నారు. కూరగాయలపై చాలా రకాల రసాయన సమ్మేళనాలు పేరుకుపోయి ఉంటున్నాయి. దీంతో అవి పచ్చిగా తినడం వల్ల అనారోగ్యం చేరుతుంది. అందుకే కూరగాయలను తినడం అంత మంచిది కాదు. కొన్ని కూరగాయల్లో చక్కెర ఉంటుంది. దీని వల్ల అవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది.
ఇవి జీర్ణం కాకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. జీర్ణ సమస్యలు వేధిస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకని కూరగాయలను కడిగి ఉడికించినవి మాత్రమే తినాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈనేపథ్యంలో కూరగాయలను ఎప్పుడు కూడా పచ్చివి తినడం అంత మంచిది కాదనే విషయం తెలుసుకుంటే మంచిది.
కూరగాయల్లో కిడ్నీబీన్స్, ఆకుకూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, బ్రోకలీ, పుట్టగొడుగులు వంటివి పచ్చివి అసలే తినకూడదు. ఇందులో పురుగులు కూడా ఉండొచ్చు. దీని వల్ల మనకు అనారోగ్యం దరిచేరరొచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలంటే కూరగాయలు తినే విధానంలో కూడా మార్పులు ఉండాలి. ఎలా పడితే అలా తింటే మన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం.