26.1 C
India
Saturday, June 22, 2024
More

    Etela Rajender : ఎవరి కోసం ఈటలకు బీజేపీ పగ్గాలు

    Date:

    Etela Rajender
    Etela Rajender

    Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను ఎదురు దెబ్బ తీసింది. రాబోయే ఎన్నికలకు ఇప్పుడే సవాల్ విసిరింది. బీజేపీ బలానికి బిఆర్ఎస్ అభ్యర్థులు తట్టుకోలేక ఇంటిదారి పట్టారు. కనీసం ఒక్క స్థానంలో కూడా పార్టీ జెండా ఎగురవేయలేక పోయారు. అంటే ప్రజల్లో ఆ పార్టీ ఏ మేరకు ఉందొ చెప్పాల్సిని అవసరం లేదు. గులాబీ బలహీనతలను అవకాశంగా తీసుకొని ఏకంగా ఎనిమిది స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకొంది. 2019 ఎన్నికల కంటే రెట్టింపు స్థానాల్లో 2024  ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచారు. కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టారు. మోదీ మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ లో సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి కి బెర్త్ దొరికింది.

    ప్రస్తుతానికి పార్టీ రాష్ట్ర భాద్యతలు కిషన్ రెడ్డి చేతిలోనే ఉన్నాయి. ఆ భాద్యతలను తాజా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కు అప్పగించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఒకవేళ నిజమే అయితే ఈటల రాజేందర్ కు ఎందుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారు. అయన కంటే సీనియర్ నాయకులు ఉన్నారు. సంఘ్ పరివార్ నుంచి వచ్చి పార్టీ భాద్యతలు మోస్తున్న సీనియర్ నాయకులు కూడా చాలా మందే ఉన్నారు. వాళ్ళందరిని కాదని ఈటల రాజేందర్ కే పార్టీ భాద్యతలను భుజాన ఎత్తుతున్నారంటే ఆ అంతరంగం వేరే అయి ఉంటుంది. అది కేవలం భారత రాష్ట్ర సమితి పార్టీ మహా వృక్షానికి వేరు భాగం అనేది కూడా లేకుండా చేయడానికే అని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో.

    ఈటల రాజేందర్ బీసీ నాయకుడు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వెంట నడిచారు. బిఆర్ఎస్ పార్టీలో అయన అనుచరులు, నమ్మకం కలిగిన నాయకులు సైతం ఉన్నారు. పరిపాలన పరంగా ఆయనకు అనుభవం ఉంది. రాష్ట్ర ఆర్థిక గణాంకాలతో పాటు, దాదాపుగా అన్ని శాఖలపై పట్టు ఉంది. కాబట్టి పార్టీ భాద్యతలు అప్పగిస్తే ఒకవైపు అధికార పార్టీని ఎండగడుతూనే , మరోవైపు బిఆర్ఎస్ కోటను కూల్చే పని సాధ్యమవుతుందనే ఈటల రాజేందర్ కు పార్టీ అధ్యక్ష భాద్యతలు అప్పగిస్తున్నట్టు బీజేపీ వర్గాల సమాచారం.

    Share post:

    More like this
    Related

    Trump Sensation : అమెరికాలో గ్రాడ్యూయేషన్ చేసిన వారికి గ్రీన్ కార్డ్.. ట్రంప్ సంచలనం

    Trump Sensation : యూఎస్ఏలోని కాలేజీలు, యూనివర్సిటీలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న...

    AP CEO : బాబు ఏపీ సీఎం కాదు.. సీఈవోనట..

    AP CEO : ఏపీ సీఎం చంద్రబాబుకు ముందు నుంచి టెక్నాలజీపై...

    Priyanka Gandhi : తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. ప్రచారానికి మమతా బెనర్జీ

    Priyanka Gandhi : రానున్న కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికలో కాంగ్రెస్...

    NEET : కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నీట్ సెగ

    -  ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు NEET : కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోంది: వైఎస్ షర్మిల

    YS Sharmila : డాక్టర్లు అవుదామని ఆశతో ఉన్న 24 లక్షల...

    Pocharam Srinivas : బీఆర్ఎస్ నుంచి సీనియర్ నేత ఔట్.. కాంగ్రెస్ గూటికి మాజీ స్పీకర్

    Pocharam Srinivas : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మరో షాక్...

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    Narendra Modi : మోదీ ప్రమాణస్వీకారానికి అతిరథమహారథుల రాక

    Narendra Modi : మోదీ ప్రమాణ స్వీకారానికి అతారథ మహారథులు వస్తున్నారు....