33.3 C
India
Thursday, May 16, 2024
More

    Rushikonda Destruction : రుషికొండకు గుండు.. వైసీపీ మార్క్ విధ్వంసం

    Date:

    Rushikonda Destruction
    Rushikonda Destruction

    Rushikonda Destruction : విశాఖ నగరానికి మణిహారంలా నిలిచే రుషికొండకు వైసీపీ సర్కారు గుండు కొట్టింది. కొండను తొలచి మొత్తం నిర్మాణాలు చేపట్టింది. ఇక ఈ నిర్మాణాలు పూర్తయితే అక్కడ కొండ కూడా మిగిలే చాన్స్ లేదు. ముందుగా వైజాగ్ లోని రుషికొండ బీచ్ కు ఎంతో పేరుంది. దీనిని గతంలోనే కేంద్రం గుర్తించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రుషికొండను విధ్వంసం చేసింది. గతంలో కొండపై 5.99 ఎకరాల్లో హరితా రిస్సార్ట్స్ ఉండేవి. వీటి పనర్నిర్మాణం పేరుతో కొత్త నిర్మాణాలను వైసీపీ సర్కారు మొదలుపెట్టింది.

    రుషికొండ విస్తీర్ణం 69.65 ఎకరాలైతే అందులో ఏకంగా 61 ఎకరాల్లో కట్టడాలకు జీవీఎంసీ ప్లాన్ రెడీ చేసింది. ప్రస్తుతం 21 ఎకరాల్లో కొండను తొలిచివేశారు. మిగతా 40 నిర్మాణాలను త్వరలోనే తొలిచేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇఖ ఇక్కడ రుషికొండ అనేది కేవలం ఒక గుర్తుగా మాత్రమే మిగిలిపోనుంది. అయితే ఇక్కడ ఏం నిర్మాణం చేపడుతున్నారనడానికి ఎక్కడా పబ్లిక్ డోమైన్ లో లేదు.

    అయితే రుషికొండపై నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నారని, అనుమతులకు అదనంగా తవ్వేస్తున్నారని జనసేన కార్పొరేటర్ 2021 డిసెంబర్లో హైకర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎంపీ రఘురామకృష్ణం రాజు కూడా దీనిపై పిటిషన్లు వేశారు. దీంతో పర్యాటక శాఖ అధికారులు 9.88 ఎకరాల విస్తీర్ణంలో హరిత రిస్సార్ట్స్ పునర్నిర్మాణానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకొని జీవీఎంసీకి ప్లాన్ కోసం దరఖాస్తు చేశారు. తర్వాత 21 ఎకరాల్లో విధ్వంసం కానిచ్చేశారు. ఇద కోర్టు ధిక్కరణ అంటూ మూర్తి యాదవ్ మరోసారి హైకోర్టను ఆశ్రయించారు.

    గతంలో 5.99 ఎకరాల విస్తీర్ణం ఉంటే, ఇప్పుడు 61 ఎకరాలను విధ్వంసం చేయాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే దీంతో పాటు రూ. 100 కోట్ల వరకు జీవీఎంసీకి చెల్లించా్సి ఉంది. అయినా రెండు శాఖల అధికారులు దీనిని పట్టించుకోలేదు. ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉండడంతో ఆ రెండు శాఖలు కూడా దీని గురించి మాట్లాడేందుకు జంకుతున్నారు. అయితే ఈ నిర్మాణాలు ఏపీ సీఎం జగన్ కోసమే అన్న అభిప్రాయమే వినిపిస్తున్నది. దీనికోసం అడుగడుగునా ఉల్లంఘనలు, వందల కోట్ల ప్రజా ధనం వ‌ృథా చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.  నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ , సుప్రీం ఆదేశాలను ఏపీ సర్కారు బేఖాతరు చేస్తూ రాష్ర్ట పర్యాటక శాఖ, జీవీఎంసీ ఈ నిర్మాణాలను చేపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : రుషికొండను మింగిన అనకొండ వైఎస్ జగన్ : నారా లోకేశ్

    Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై...

    YV vs Vijayasai : వైవీ వర్సెస్ విజయసాయి.. మరోసారి వైసీపీలో వార్

    YV vs Vijayasai : వైసీపీలో ముఖ్య నేతల మధ్య వర్గ విభేదాలు...

    AP CM Jagan : ఏపీ సీఎం లోకేషన్ చేంజ్..ఇక అక్కడే మకాం..!

    AP CM Jagan : విశాఖ‌ప‌ట్నం నుంచి పాల‌న సాగించ‌డానికి ముహూర్తం ఫిక్స్...