Pooja Hegde fate : ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో ఉన్న హీరోయిన్లు కిందకు పడిపోతున్నారు. అందులో పూజా హెగ్డే కూడా ఒకరు. తన అందంతో నటనతో అందరిని ఆకర్షించిన పూజా ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉంటోంది. టాలీవుడ్ లో మంచి దూకుడు మీదున్న ఆమె ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటోంది. అదృష్టం కలిసి రాకపోతే అంతే. అదే అదృష్టం మన వెంట ఉంటే ఏదైనా సాధ్యమే.
ఒక లైలా కోసం సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె ఒక దశలో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అక్కడే స్థిరపడుతుందని అనుకున్నారు. హిందీలో హృతిక్ రోషన్ తో మెహన్ జొదారో సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది. రెండేళ్ల గ్యాప్ ఇచ్చి తరువాత అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథంలో నటించింది. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. కానీ పూజకు మాత్రం మంచి ప్లస్ అయింది. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించింది.
టాలీవుడ్ లో హిట్లు వచ్చినా ఆమె లక్ మాత్రం రివర్స్ అయింది. గుంటూరు కారంలో అవకాశం వచ్చినా వదులుకుంది. దీంతో తనకు సినిమాలు రావడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. శ్రీలీల జోరుకు పూజా అదృష్టం మారిపోయిందని అంటున్నారు. టాప్ లో ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా కిందకు పడిపోవడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక చేసేదేమీ లేక ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. తెలుగు పరిశ్రమలో హీరోయిన్లు కొత్తగా ఎంతో మంది పుట్టుకొస్తున్నారు. దీంతో వారి ధాటికి పాత వారు దూరంగానే ఉండాల్సి వస్తోంది. ఇందులో భాగంగానే పూజా హెగ్డే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూజాకు సినిమాలు వస్తాయో లేదో ఇక ఆమె జాతకం ఎలా ఉందో ఆమెకే తెలియాలి అంటున్న ప్రేక్షకులు.