horoscope today మేష రాశి వారికి మంచి వాతావరణం ఉంటుంది. ధర్మంగా ప్రవర్తిస్తారు. ప్రయత్నంతో పనులు పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మంచిది.
వ్రషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంతో ముందడుగు వేయాలి. కొన్ని విషయాలు నిరుత్సాహం కలిగిస్తాయి. లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
మిథున రాశి వారికి మధ్యమంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. నవగ్రహ శ్లోకం చదువుకుంటే చాలా మంచి లాభాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ముందుకు వెళ్లాలి. గోవింద నామాలు జపించడం వల్ల మంచి జరుగుతుంది.
సింహ రాశి వారికి మంచి కాలం. ధైర్యంతో ముందుకు వెళ్లాలి. అధికారులతో ప్రశంసలు దక్కుతాయి. ఆర్థిక లాభాలుంటాయి. ఇష్టదేవత శ్లోకం చదివితే ఫలితాలు బాగుంటాయి.
కన్య రాశి వారికి వివాదాల జోలికి వెళ్లకండి. సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటే మంచిది. ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు వస్తాయి. దుర్గారాధన చేయడం వల్ల మేలు కలుగుతుంది.
తుల రాశి వారికి ధైర్యంతో ఉంటారు. సహనంతో ఉండాలి. ఆందోళనలకు గురికాకండి. నవగ్రహ శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
వ్రశ్చిక రాశి వారికి అధికారులతో మంచి సంబంధాలుంటాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. శ్రీరామ నామం జపించడం వల్ల విశేష ఫలితాలుంటాయి.
ధనస్సు రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన లాభాలుంటాయి. గొడవలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతను పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
మకర రాశి వారికి ఉత్సాహం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అనుకూలమైన కాలం. శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మేలు కలుగుతుంది.
కుంభ రాశి వారికి పనుల్లో పురోగతి సాధిస్తారు. మనో సంతోషం కలుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణు సహస్ర నామాలు చదవడం మంచిది.
మీన రాశి వారికి మంచి కాలం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం ఫలితాలు తెస్తుంది.
ReplyForward
|