38 C
India
Wednesday, May 15, 2024
More

    Behind the train accident : రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా…? నిజం బయటపెట్టిన రైల్వేశాఖ

    Date:

    behind the train accident
    behind the train accident

    Behind the train accident : ఒడిసా, బాలేశ్వర్ జిల్లాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం ఎలా జరిగింది..? అన్నదానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశంతో పాటు ఇప్పుడు ప్రపంచాన్ని కూడా ఆవేదనకు గురి చేసింది. ఈ ఘటనపై వివిధ దేశాల అధ్యక్షులు ప్రముఖులు భారత్ కు సంతాపం తెలిపారు. ఇదంతా పక్క నుంచితే ఈ ఘటనలో మూడు రైళ్లు ఢీ కొన్నాయి. ఇందులో ఏమన్నా కుట్ర కోణం దాగుందా..? అన్న కోణంలో దర్యాప్తు చేసిన రైల్వే శాఖ చివరికి ఒక విషయాన్ని తేల్చింది.

    : ఒడిశా రైలు ప్రమాద ఘటనకు దారి తీసిన మూల కారణాన్ని కనుగొన్నామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌’లో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. ఘటనా స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

    ఈ ప్రమాదానికి కారణం సిగ్నలింగ్ లోపమే అంటూ ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదం జరిగిన స్టేషన్ కు 6.56 గంటలకు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ వచ్చింది. అయితే ఆ స్టేషన్ లో ఆగకుండా మెయిన్ లైన్ నుంచి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ట్రైన్ లూప్ లైన్ లోకి వెళ్లింది. అయితే మెయిన్ లైన్ లో కోరమండల్ వస్తుందని ఆ స్టేషన్ లో లూప్ లైన్ లో గూడ్స్ ను నిలిపి ఉంచారు. దీంతో వేగంగా వచ్చిన కోరమాండల్ వెనుక వైపునుంచి గూడ్స్ ను ఢీ కొంది. ఇదే సమయంలో (అంటే దాదాపు నిమిషం లోపే’ పక్క ట్రాక్ నుంచి రివర్స్ లో హౌరా వస్తుంది. గూడ్స్ ను ఢీ కొనడంతోనే కోరమాండల్ బోగీలు హౌరా వెనుక బోగీలపై పడింది. దీంతో మరిన్ని ప్రాణనష్టం పెరిగింది.

    మెయిన్ లైన్ లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లూప్ లైన్ లోకి ఎందుకు వచ్చిందనే ఇక్కడ ప్రశ్న. ఇక్కడి స్టేషన్ మాస్టర్ కోరమాండల్ ను మెయిన్ లైన్ నుంచి వెళ్లమని సూచించాడు. కానీ ఇక్కడ లూప్ లైన్ లోకి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఇలా ఎందుకు లూప్ లైన్ లోకి మారారు అన్నదానిపై ఇప్పుడు దర్యాప్తు సాగుతుంది. ఒక ట్రైన్ ఎదురుగా ఒకలైన్ (కోరమాండల్), మరో ట్రైన్ దానికి ఎదురుగా మరో లైన్ (హౌరా) దేనికదే వెళ్లేందుకు సిగ్నల్ ఇచ్చారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. హౌరా కరెక్టే వెళ్లినా.. కోరమాండల్ మాత్రం ట్రాక్ తప్పింది. ఇంకా కొన్ని సెకన్ల ముందు హౌరా కనుక వచ్చి ఉంటే ప్రాణనష్టం మరింత తీవ్రంగా ఉందేదని తెలుస్తోంది.

    ఏది ఏమైనా దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఏమీ చెప్పలేరని తెలుస్తోంది. మానవ తప్పిదామా..? సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా..? రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని రైల్వే అధికారులు చెప్తున్నారు. దీని వెనుక ఎలాంటి కుట్రలు లేవని అంటున్నారు. ఏది ఏమైనా 20 సంవత్సరాల్లో ఒకే ట్రయిన్ కు రెండు సార్లు ప్రమాదాలు జరగడంపై దేశం యావత్తు దిగ్భ్రాంతిలో ఉంది.

    -ప్రమాద తీవ్రత పెరగడానికి కారణం అదే

    గూడ్స్ రైలు పట్టాలు తప్పలేదు. గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉన్నందున, దాని ప్రభావం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌పై ఎక్కువగా ఉంది, ఇనుపఖనిజం బరువు బాగా ఉండడం వల్లే ఇలా సాధ్యమైంది. ఇది భారీ సంఖ్యలో మరణాలు , గాయాలకు కారణం. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు డౌన్‌లైన్‌పైకి వచ్చి, డౌన్‌లైన్ నుండి గంటకు 126 కి.మీ వేగంతో దాటుతున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ చివరి రెండు బోగీలను ఢీకొట్టింది: -జయ వర్మ సిన్హా, ఆపరేషన్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సభ్యుడు, రైల్వే బోర్డు

    Share post:

    More like this
    Related

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్య

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్యకు గురైన సంఘటన...

    Jagan Foreign Tour : జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

    Jagan Foreign Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ కు...

    Raghurama : ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పిన RRR.. ఇదే నిజం!

    Raghurama : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Train Accident : బాలాసోర్ ఘటనను మరువకముందే.. మరో ట్రైన్ యాక్సిడెంట్.. ఎంత మంది చనిపోయారంటే?

    Train Accident : భారత రైల్వే వ్యవస్థ అత్యంత పెద్ద నెట్...

    Falak Numa Super Fast : ఫలక్ నూమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో అగ్నిప్రమాదం

    నల్లగొండ జిల్లా పగిడిపళ్లి వద్ద నిలిపివేసి మంటలను ఆర్పుతున్న సిబ్బంది. ...

    Trains canceled : విజయవాడ-విశాఖ మార్గంలో 8 రైళ్లు రద్దు

    Trains canceled : విశాఖపట్నం- విజయవాడ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో...

    Goods Train Odisha : ఒడిశాలో మరో రైలు ప్రమాదం

    Goods Train Odisha : ఒడిశాలో ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు...