31 C
India
Thursday, May 16, 2024
More

    పొత్తులను డిసైడ్ చేయ్యనున్న కర్ణాటక ఫలితాలు

    Date:

    karnataka-elections-2023
    karnataka-elections-2023

    కర్ణాటకలో బీజేపీకి ఓటమి కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటీకే స్థానిక నాయకత్వంతో తలలు పట్టుకుంటున్న బీజేపీ అధిష్టానం  కొత్త చిక్కు వచ్చి పడే అవకాశం ఉంది. కర్నాటకలో మే 10న జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న తరుణంలో గత ఏడాది కాలంలో జరిగిన ప్రతీ ఎన్నికను సెమీ ఫైనల్ గా చెప్పుకుంటూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు కర్నాటకలో గెలుపు అత్యవసరంగా మారింది.  ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా  పెద్ద ప్రచారం చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు కమలనాథులకు గెలుపు ఎంత ముఖ్యమో.. కర్నాటకలో బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం  చాలా రాష్ట్రాలపై పడబోతోంది.

    ఇప్పటికే పలు ప్రీ పోల్ సర్వేలు కాంగ్రెస్ కు స్పష్టమైన మేజార్టీ వస్తుందని  సర్వే ఫలితాలను ప్రకటించాయి.      ముఖ్యంగా కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు తెలుగు రాష్ట్రాల్లో సమీకరణాల్ని సమూలంగా మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కర్నాటకలో అధికార బీజేపీ, విపక్షకాంగ్రెస్ మధ్య గట్టిపోటీ నెలకొంది. ఈ పోరులో కాంగ్రెస్ ఒంటరిగానే అధికారంలోకి రాబోతున్నట్లు పలు సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికార, అనధికార మిత్రులుగా ఉన్నవారంతా అలర్ట్ అయ్యారు. అలాగే కొత్తగా బీజేపీతో పొత్తు పెట్టుకుందామని భావిస్తున్న పార్టీలు కూడా అప్రమత్తం అయ్యాయి. వీరంతా వేచి చూసే ధోరణిలోకి వెళ్లిపోయారు.

    ఏపీలో చూసుకుంటే బీజేపీతో ఇప్పటికే అధికార వైసీపీతో పాటు ప్రధాన విపక్షం టీడీపీ అనధికార మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. జనసేన ఎలాగో అధికారికంగానే మిత్రపక్షంగా ఉంది. ఇప్పుడు ఈ మూడు పార్టీల్లో బీజేపీకి అధికారికంగా దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ఫలితాలు తేడా వస్తే మాత్రం టీడీపీ సైలెంట్ అయిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. బీజేపీ గెలిస్తే మాత్రం ఈ పొత్తు ప్రయత్నాలు మరింత తీవ్రం చేయొచ్చు.

    మరోవైపు తెలంగాణలో బీజేపీతో ప్రస్తుతం ఏ పార్టీకి పొత్తు లేదు. కానీ వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ  బీజేపీ తో కలవాలని చూస్తున్నట్లు సమాచారం. అలాగే టీడీపీ కూడా బీజేపీతో పొత్తు కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు కర్నాటకలో ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే మాత్రం షర్మిల కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయడం ఖాయం. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పొత్తు రాజకీయాల్ని డిసైడ్ చేయబోతున్న కర్నాటక ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడి పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Changes in BJP : బీజేపీలో మార్పులు ఫలించేనా..? 

    Changes in BJP : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత...

    CBN self goal : సీబీఎన్ సెల్ఫ్ గోల్.. కర్ణాటక ఎన్నికలా ప్రభావమా.. జగన్ ట్రాప్ లోకా.?

    CBN self goal : టీడీపీ మహానాడు లో  ప్రకటించిన మినీ...

    Telangana Congress : దూకుడు పెంచిన టీ కాంగ్రెస్.. భారీ స్కెచ్ తో ముందుకు..!

    Telangana Congress : కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్ లో...

    Winning in Karnataka : కర్ణాటకలో గెలిచిన ఆనందమూ దక్కట్లే..!

    కాంగ్రెస్ శ్రేణుల మనోగతం winning in Karnataka ఫ కర్ణాటక అసెంబ్లీ...