Vijay “Khushi” Movie : యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమాతో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా ఎదిగి తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న విజయ్ ఎన్ని ప్లాప్స్ వచ్చిన కెరీర్ లో మరింత నిలదొక్కుకుంటూ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.
గీతా గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా ప్లాప్స్ మాత్రమే పలకరిస్తున్నాయి.. అయినప్పటికీ విజయ్ క్రేజ్ పాన్ ఇండియా లెవల్లో పెరిగింది.. ఇక ప్రస్తుతం విజయ్ ”ఖుషి” సినిమా చేస్తున్నాడు. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఖుషి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..
సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరిని అలరిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. మరి తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ సభ్యులు ఇచ్చిన రివ్యూ ప్రకారం ఈ సినిమా ఎలా ఉందంటే..
ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేసినట్టు టాక్.. అంతేకాదు ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఈ కంటెంట్ కు ఫిదా అయ్యారని ముఖ్యంగా ఖుషి సినిమాలో యూత్ ను ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించే ఎన్నో అంశాలను చూపించారని మొత్తంగా ఈ సినిమా అన్ని వర్గాల ఆడియెన్స్ ను అలరించడం ఖాయం అని అంటున్నారు. విజయ్ కెరీర్ లో పెళ్లి చూపులు సినిమాకు మాత్రమే క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. మరి ఆ సినిమాలానే ఇది సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.