37.8 C
India
Saturday, May 18, 2024
More

    Krishna Gadu Ante Oka Range Review : ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ రివ్యూ అండ్ రేటింగ్..

    Date:

    Krishna Gadu Ante Oka Range
    Krishna Gadu Ante Oka Range

    Krishna Gadu Ante Oka Range Review : ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు సినిమాలు నచ్చితే చాలు వాటికీ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోవడంతో సినిమాను చూసే విధానంలో కూడా మార్పు వచ్చేసింది.. కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు భారీ డిజాస్టర్స్ గా నిలుస్తుంటే చిన్న చిన్న సినిమాలు సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి.

    ఈ క్రమంలోనే చిన్న సినిమాల జోరు అమాంతం పెరిగింది.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి చిన్న సినిమాలు రిలీజ్ తర్వాత తమ సత్తా చూపిస్తున్నారు. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలే ఎక్కువ లాభాలను పొందుతున్నాయి.. ఏదైనా కాన్సెప్ట్ ను నమ్ముకుంటే విజయాలు వరించడం ఖాయం.. ఇక ఈ వారం కూడా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో చిన్న సినిమాల హవానే కొనసాగనుంది..

    మరి ఈ వారం థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాల్లో ”కృష్ణగాడు అంటే ఒక రేంజ్” కూడా ఉంది.. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్ ను ఎంత బాగా ఆకట్టుకుంది? అందులో ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి? అనేవి తెలుసుకుందాం..

    రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన ఈ సినిమాను రాజేష్ దొండపాటి డైరెక్ట్ చేసారు.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, వెంకట సుబ్బమ్మ, శ్రీలత సంయుక్తంగా నిర్మించారు..

    కథ :

    కృష్ణ (రిష్వి) తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో కుటుంబ భారం తనపై పడుతుంది. చిన్నతనం నుండే తన మామతో కలిసి మేకలు కాస్తుంటాడు.. ఒక ఫంక్షన్ లో సత్య (విస్మయ) తన అమాయకత్వం నచ్చి అతడిని ఇష్టపడుతుంది.. కృష్ణ కూడా ఇష్టపడతాడు.. ఊర్లో అల్లరిచిల్లరిగా తిరిగే దయా (రఘు) కనపడ్డ ఆడవాళ్లందరిని ఏడిపిస్తుంటాడు.. సత్యపీ కూడా అతడి చూపు పడడంతో వీరి ప్రేమను ఎలాగైనా విడదీసి సత్యను దక్కించు కోవాలని చూస్తాడు.. ఈ క్రమంలోనే కృష్ణ దయాపై ఛాలెంజ్ చేసి మూడు నెలల్లో ఇల్లు కట్టుకుని, పెళ్లి చేసుకుని చూపిస్తా అంటూ ఛాలెంజ్ విసురుతాడు.. మరి దయా ఎలాంటి అడ్డంకులు సృష్టించాడు? కృష్ణ, సత్య ప్రేమ నిలబడిందా? అనేది మిగిలిన కథ..

    విశ్లేషణ :

    చిన్న సినిమాలకు కథ ముఖ్యం కాబట్టి కథ అనేది బాగుంటేనే ఆడియెన్స్ థియేటర్ వరకు వస్తారు.. ఇక ఈ సినిమా ఈ విషయంలో పర్వాలేదు.. నెగ్గుతాడు అనే చెప్పవచ్చు.. కాకపోతే స్టోరీ కొద్దిగా రొటీన్ అనిపించింది. సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కథలో కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉంటాయి.. వీరి లవ్ స్టోరీ ఆకట్టుకుంటుంది.. ఎమోషన్స్, లవ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా డైరెక్టర్ తీయగలిగాడు.. కథ రొటీన్ గానే ఉన్న స్క్రీన్ ప్లే కొత్తగా ఆకట్టుకుంది.

    పర్ఫార్మెన్స్ :

    కృష్ణ పాత్రలో రిష్వి ఇన్నోసెంట్ గా బాగా ఆకట్టు కున్నాడు.. కొత్త కుర్రాడు అయిన అన్ని ఎమోషన్స్ ను పలికించాడు.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ విస్మయ పాత్ర హైలెట్ గా నిలిచింది.. ఈ భామ కొత్త హీరోయిన్ అయినా అనుభవం ఉన్న నటిగా నటన కనబర్చింది. మిగిలిన పాత్రలు కూడా తమ నటనతో మెప్పించారు.

    ఇక సినిమాకు సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.. బీజీఎమ్ సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచింది.. సాబు వర్గీస్ సంగీతం అందించగా ఈయన సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి.. సినిమాటోగ్రఫి కూడా బాగుంది.. డైరెక్టర్ కథ చెప్పిన తీరు ఆకట్టుకున్న ఇంకాస్త పని చెప్పుంటే బాగుండేది..

    చివరిగా.. కృష్ణగాడు అంటే ఒక రేంజ్ ఒకసారి చూసే టైం పాస్ మూవీలా ఉంటుంది అని చెప్పవచ్చు.. యూత్ ను బాగానే ఆకట్టు కుంటుంది..

    రేటింగ్ : 2/5

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

    Dunki Review : షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్...

    Jawan & Kattappa : ‘కట్టప్ప’కు ‘జవాన్’కి ఉన్న లింకేంటి.. అట్లీ మామూలోడు కాదు..!

    Jawan & Kattappa : షారుఖ్ సెన్సేషనల్ మూవీ ‘జవాన్’ మూవీతో ‘బాహుబలి’...

    Cinema News : తమకంటే తక్కువ వయసు కలిగిన హీరోలతో నటించిన హీరోయిన్స్ వీళ్లే..!

    Cinema News : ప్రేమ ఎప్పుడు.. ఎవరి మీద పుడుతుందో.. ఏ వయసులో...

    Cinema News : ‘జైలు’ సెంటిమెంట్ ఉంటే బ్లాక్ బస్టరేనా..!

    Cinema News : సినిమాలో జైలు సెంటిమెంట్ ఉంటే అది బ్లాక్...