MLC Elections : తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల కు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. కడియం శ్రీహరి, పాడి కౌషిక్ రెడీ ఎమ్మెల్యే లుగా ఎన్నిక కావడం తో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆయా స్థానాల్లో ఉపఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ రానుంది. 29వ తేదీన పోలింగ్ జరుగుంది. నామినేషన్ ల ధరఖాస్తు గడువు 18 తేదీన ముగియనుంది.
మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో రెండు పార్టీలు తమ అభ్యర్థ లను ఎంపిక చేసే పనిలో పడట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో మొన్న టికెట్ లు త్యాగం చేసినవారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా మాకు సీటు లభిస్తుందనీ ఎదురు చూస్తున్నారు. మొదటి నుండి పార్టీ కోసం కష్టపడిన వారికీ టికెట్స్ ఇవ్వాలని కొందరు ఇప్పటికే పావులు కదుపుతున్నారు. మొత్తం మీద తెలగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది.