34.1 C
India
Saturday, May 18, 2024
More

    Surekha Konidela : వదిన గురించి అసలు నిజం బయట పెట్టి మెగా బ్రదర్..

    Date:

    Surekha Konidela :

    ఇండస్ట్రీలో సుధీర్ఘ కాలం కలిసి ఉన్న కుటుంబాల గురించి లెక్కిస్తే మొదట చెప్పుకునే పేరు కొణిదెల ఫ్యామిలీ. చిరంజీవి టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సమయంలో నాగబాబు, పవన్ కల్యాణ్ చిన్న వారు. అన్న గారి వెంట వారు కూడా ఇండస్ట్రీలోకి వచ్చారు. శివశంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా మారడం. ఆయనతో పాటు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి రావడం వారు కూడా అన్న నీడన ఎదుగుతూ పోవడం జరిగిపోయాయి. ఇప్పుడు ఎవరి కుటుంబంతో వారు ఉన్నా.. ఏ పండుగైనా, పబ్బమైనా అందరూ కలిసే జరుపుకుంటారు.

    ఇటీవల నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నిశ్చితార్థం, తర్వాత వివాహ వేడుకలకు కుటుంబం మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది. పెళ్లి వేడుకలకు సంబంధించి కొన్ని ఫొటోలను ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన ఇన్ స్టా ద్వారా షేర్ చేశాడు. వరుణ్ బాబు వివాహ మహోత్సవం భారీగా నిర్వహిస్తామని ఆయన చెప్పడం కూడా కొసమెరుపు. ఇక, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం అన్న మద్దతు ఎవరికి అంటూ ప్రశ్నలు లేవనెత్తగా.. తప్పకుండా తమ్ముడికే అంటూ చిరంజీవి చెప్పారు. ఇలా సాదక బాధకాల్లో అందరూ కలిసే ఉంటారు.

    నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వూలో చిరంజీవి భార్య, తన వదిన సురేఖ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ‘వదిన నాకు, పవన్ బాబుకు ఎప్పటికీ తల్లి లాగే ఉంటుంది. ఎంత ఉమ్మడి కుటుంబం అయినా అప్పుడప్పుడు గొడవలు కామనే కదా.. చాలా వరకు అన్నయ్య మాట అందరం వింటుంటాం.. కానీ అన్నయ్యకు నాకు మధ్య ఏదైనా వివాదం వస్తే మాత్రం వదిన ఎంటర్ అవుతుంది. నా వైపే మాట్లాడుతుంది. అన్నను నన్ను ఏమీ అననివ్వదు.. నాకే నాకు అప్పుడప్పుడు కళ్యాణ్ బాబును కూడా సమర్థిస్తుంది. అందుకే వదిన అంటే మా ఇద్దరికీ గౌరవం. కళ్యాణ్ బాబు కంటే నేను ఎక్కువగా జోకులు వేస్తూ ఉంటాను కాబట్టి నన్ను ఎక్కువగా మెచ్చుకుంటుంది’ అని చెప్పాడు నాగబాబు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Mega Hero : మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో.. ఆమెపై ప్రేమతో..

    Mega Hero Saidharam Tej : కొందరు పేర్లను నమ్ముతారు. పేర్లలో...

    Janasena : జనసేనలో  సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు!

    Janasena : జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో.. దాదాపు...

    Nagababu Latest Post : ఒక్క పోస్ట్ తో నోరు మూయించిన నాగబాబు.. ఇప్పుడేం పీక్కుంటారు అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్

    Nagababu Latest Post : తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీకి ఉన్నంత...