30.4 C
India
Wednesday, July 3, 2024
More

    Hardik Pandya : పాండ్యా స్వార్థానికి హాఫ్ సెంచరీ మిస్ టీమిండియా కెప్టెన్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు

    Date:

    Hardik Pandya
    Hardik Pandya
    Hardik Pandya : గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో సీరిస్ పై ఆశలు సజీవంగా నిలిచాయి. వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుకుంది. సిరీస్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు 159/5 నమోదు చేసింది.  సూర్యకుమార్ యాదవ్ చేసిన ప్రత్యేక ప్రయత్నం వల్ల భారత్ తన లక్ష్యాన్ని 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే, సూర్యకుమార్ 44 బంతుల్లో 83 పరుగులతో వెస్టిండీస్ పై విరుచుకుపడ్డాడు. తిలక్ వర్మ కూడా ఆకట్టుకున్నాడు. 49 పరుగులకే పరిమితమయ్యాడు.
    భారత్‌కు గెలవడానికి కేవలం 2 పరుగులు మాత్రమే అవసరం,  అలాగే రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయిన వర్మ తన మూడో మ్యాచ్ లో హాఫ్ సెంచరికీ చేరువలో ఉన్నాడు ఈ మ్యాచ్ లో వర్మ  37 బంతులు ఆడి నాలుగు ఫోర్లు, సిక్స్ తో 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే కెప్టెన్ పాండ్యా చేసిన నిర్వాకం వల్ల వర్మ హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు.
    12 మిగిలి ఉన్నా..
    టీమిండియా విజయానికి కేవలం రెండు పరుగులు మాత్రమే కావాల్సి ఉంది.  కెప్టెన్ హార్థిక్ పాండ్యా స్ర్టైక్కు దిగాడు. హాఫ్ సెంచరీకి కేవలం ఒక్క పరుగుకు చేరువలో ఉన్న వర్మకు పాండ్యా అవకాశం ఇస్తాడని అందరూ భావించారు. కానీ హార్థిక్ సిక్స్ కొట్టి ఒక్కసారిగా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. దీంతో వర్మ 49 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిన టీమిండియా ఎంతో ఒత్తిడి ఉంది. అయితే మూడో మ్యాచ్ లో గెలిచిన సంతోషం కన్నా ఒక్క పరుగుతో వర్మ హాఫ్ సెంచరీ మిస్ కావడాన్ని  క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పాండ్యా పై విరుచుకుపడుతున్నారు.
    ధోని ఉంటే  ఏం చేసేవాడు..  
    హార్దిక్‌ చాలా స్వార్థపరుడని, నాయకత్వ లక్షణాలు అతడికి లేవంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి కొంత మంది ధోనిని చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో ధోని.. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న బాట్లర్లు ఏదైనా మైలురాయికి దగ్గరగా ఉన్నప్పుడు ఢిఫెన్స్‌ ఆడి వారికి స్ట్రైక్‌ వచ్చేలా చూసేవాడు.
    2014 టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో.. టీమిండియా విజయానికి ఆఖరి 7 బంతుల్లో ఒక్క పరుగు కావాలి. 19 ఓవర్‌ చివరి బాల్ కు తికి స్ట్రైక్‌లో ఉన్న ధోని మ్యాచ్‌ ఫినిష్‌ చేస్తాడని అంతా భావించారు. కానీ ధోని  విన్నింగ్‌ షాట్‌ కొట్టకుండా ఢిపెన్స్‌ ఆడి కోహ్లికి స్ట్రైక్‌ ఇచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు.  ఆ తర్వాతి ఓవర్‌ మొదటి బంతికే కోహ్లి ఫోర్‌ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 72 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ సందర్భాన్ని క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో పాండ్యా తీరును తప్పుబడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : జెండా తో రోడ్డు పై నిలుచున్న చిన్నారి.. కాన్వాయ్ ఆపి ఆప్యాయంగా పలకరించిన పవన్

    Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన...

    TTD : అన్న ప్రసాదాల తయారీపై తప్పుడు ప్రచారం నమ్మవద్దు: టీటీడీ

    TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని...

    Faria Abdullah : మొత్తం విప్పి చూపించేస్తున్న ఫరియా.. అందాలు చూడతరమా?

    Faria Abdullah : ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీలో బాగా వినిపించే పేరు...

    CM Chandrababu : చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏపీలో మళ్లీ ఉచితంగా ఇసుక

    CM Chandrababu : ఏపీలో అధికారం చేటప్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rohit Sharma : రోహిత్ శర్మ భీకర ఇన్సింగ్స్.. రికార్డులు బద్దలు

    Rohit Sharma : టీం ఇండియా సూపర్ 8 మ్యాచ్ లో...

    T20 World Cup 2024 : సెమీ ఫైనల్ కు చేరు జట్లు ఇవే..

    T20 World Cup 2024  : టీ 20 ప్రపంచ కప్...

    Rohit Sharma : రోహిత్ శర్మ మళ్లీ మరిచిపోయాడు

    Rohit Sharma : టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా...

    Hardik Pandya : హర్దిక్ నువ్వు మామూలోడి కాదు బాస్.. ఇలాంటి వారికి నువ్వై సరైన మొనగాడివి.  

    Hardik Pandya : టీమ్‌ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, తన...