31.9 C
India
Friday, May 17, 2024
More

    Heart Attack Factors: గుండెపోటు ఎలా  వస్తుందో తెలుసా.. 8 కారణాలు మీకోసం..

    Date:

     

    Heart Attack
    Heart Attack

    Heart Attack Factors:

    ఇటీవల గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. ముఖ్యంగా యువత, చిన్నపిల్లల్లోనూ గుండె ఆగడం లాంటి ఘటనలు తరచూ వార్తల్లో చూస్తున్నాం. దీనికి ప్రధానంగా జీవన శైలిలో మార్పే కారణమంటూ చాలా మంది నిపుణులు చెప్పుకొస్తున్నారు.  ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోవడం.. జీవనశైలిలో మార్పు, ఆహారం, వ్యాయామం లేకపోవడం లాంటివి కూడా గుండెపోటుకు కారణాలుగా వైద్యనిపుణులు చెబుతున్నారు.  అయితే ముందుగా ఛాతి నొప్పి, ఛాతిలో అసౌకర్యం అనేది అందరికీ గుండెపోటు అనే భయాన్ని పుట్టిస్తుంది. అయితే అన్ని సందర్భాల్లో ఛాతినొప్పి గుండెనొప్పి కాదు.

    అయితే ముందుగా మనకు వచ్చింది గుండెపోటా.. కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గురుగ్రామ్ కు చెందిన మెదంతా హార్ట్ ఇనిస్టిట్యూట్ కు చెందిని సీనియర్ డైరెక్టర్, క్లినికల్ మరియు ప్రివెంటివ్ కార్డియాలజీ డాక్టర్ మనీష్ బన్సల్ ఈ విధంగా చెబుతున్నారు. నిజమైన గుండెపోటు సమస్యలు, వాటి మధ్య తేడాను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.  కింది విధాల్లో మనకు కొంత నొప్పి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది.

    గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి: ఇది తరచుగా వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ అని పిలుస్తారు, GERD ఛాతీ నొప్పికి కారణమవుతుంది, ఇది గుండెపోటును పోలి ఉంటుంది. కడుపు నుంచి ఆమ్లాలు
    అన్నవాహికకు చికాకు కలిగించి, ఛాతి నొప్పికి దారి తీస్తుంది
    .
    ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా మండుతూ ఉంటుంది. ఇక తీవ్ర భయాందోళనల వల్ల హృదయ స్పందన పెరుగుతూ ఉంటుంది. దీంతో శ్వాసలోపం ఏర్పడి ఛాతినొప్పి, తదితర లక్షణాలు ఎదురవుతాయి. తీవ్ర ఒత్తిడి కారణంగా హృదయ స్పందనలో మార్పు కనిపిస్తుంటుంది.

    ఇక పిత్తాశయం సమస్యలు కూడా తీవ్ర నొప్పిలా పరిణమిస్తాయి. పిత్తాశయ రాళ్లు, పిత్తాశయ వాపు కూడా ఛాతినొప్పికి దారితీస్తుంది. దీంతో కలిగే అసౌకర్యాన్ని కూడా గుండెనొప్పి గా భావిస్తుంటాం. మరోవైపు ఊపిరితిత్తుల సమస్యలతో కూడా  ఈ ఇబ్బంది కలుగవచ్చు.న్యూమెనియా, ఫ్లూరసీ, ఇతర ఊపిరితిత్తుల సమస్యల కారణంగా ఛాతినొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఛాతినొప్పిని కలిగించి, గుండె సంబంధిత సమస్యగా మారవచ్చు.

    కోస్టోకాండ్రిటిస్: పక్క టెముకలను రొమ్ము ఎముకకు అనుసంధానించే మృదులాస్థి యొక్క వాపు. ఇది భయంకరంగా వచ్చే ఛాతినొప్పికి దారితీస్తుంది. కానీ ఇది గుండెకు సంబంధించినది కాదు. శారీరక ఒత్తిడి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ద్వారా ప్రేరేపించబడుతుంది.

    పల్మనరీ ఎంబోలిజం: ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఛాతి నొప్పి రావడం, శ్వాసకు ఇబ్బంది కలగడం, రక్తంతో దగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు గుండెపోటును పోలి ఉంటాయి. సరైన రోగ నిర్ధారణ అవసరాన్ని మనకు నొక్కి చెబుతాయి.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Breast Cancer : రొమ్ము క్యాన్సర్.. మమోగ్రఫీపై షాకింగ్ నిజాలు..

    Breast Cancer : మహిళలకు ఎక్కువగా వచ్చే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్....

    Dreams : కలలో పాములు కనిపిస్తున్నాయా?

    Dreams : మనకు కలలో ఏవో వస్తుంటాయి. కొందరికి పాములు కనిపిస్తుంటాయి....

    Breakfast : ఉదయం అల్పాహారం ఏ సమయంలో చేయాలో తెలుసా?

    Breakfast : మనం ఉదయం సమయంలో అల్పాహారం చేస్తుంటాం. కానీ చాలా...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...