40.2 C
India
Sunday, May 19, 2024
More

    Chiranjeevi : యుగానికి ఒక్కడు.. మన మెగా స్టారుడు

    Date:

    chiru
    chiru

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అంటే వ్యక్తి కాదు ఒక శక్తి. ఆయన పేరు చెబితే ఊగిపోయే ప్రేక్షకులున్నారు. ఆయన పేరు మీదే కొన్ని రికార్డులున్నాయి. సాధారణ కానిస్టేబుల్ కొడుకైనా పరిశ్రమను ఏలే వరకు వెళ్లాడు. చిరు అంటే ఇష్టపడని వారుండరు. కొణిదెల శివశంకర వర ప్రసాద్ చిరంజీవి అసలు పేరు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్లు నాగేంద్ర బాబు, పవన్ కల్యాణ్. నాగబాబు నిర్మాతగా కొన్ని సినిమాలు చేశాడు. ఇక పవన్ కల్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నయ్య పేరు నిలిపిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

    త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఉన్నట్లు చిరంజీవి యుగం కూడా ఉంటుందని అంటున్నారు. చిరంజీవికి కలలో ఆంజనేయ స్వామి కనిపించి నీ పేరు చిరంజీవిగా మార్చుకోమని చెప్పడం వల్ల చిరు అలా మార్చుకుని తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన శైలిలో రాణించడం గమనార్హం. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం విశేషం.

    కళ అనేది అందరికి ఉండదు. అది ఉన్న వారికి లక్ కలిసి రాకపోతే కష్టమే. కానీ చిరంజీవికి కూడా కాలం కలిసి రాలేదు. ఒక్కో సినిమాను ఒక చాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళ్లాడు. 1978లో వచ్చిన పునాదిరాళ్లు సినిమాతో తన కెరీర్ కు బాటలు వేసుకున్నాడు. కానీ ఖైదీ వరకు తనకు సరైన గుర్తింపు రాలేదు. ఖైదీతో చిరంజీవిలోని ప్రతిభ బయట పడింది.

    తరువాత కూడా కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. మళ్లీ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రాక్షసుడు తీశాడు. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలా మొదలైన కెరీర్ తరువాత మందగించింది. ఆ సమయంలో పసివాడి ప్రాణం ఆదుకుంది. అప్పట్లో అది ఇండస్ర్టీ హిట్ గా నిలిచింది. పిదప వచ్చిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలు చిరంజీవి రేంజ్ ను మరింత పెంచాయి. చిరంజీవిలోని నటుడిని బయటకు తెచ్చాయి.

    కొదమసింహం సినిమాతో చిరంజీవి మెగాస్టార్ గా బిరుదు తెచ్చుకున్నాడు. చిరంజీవి కెరీర్ లో జగదేకవీరుడు అతిలోక సుందరి పెద్ద హిట్ గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా ఎంతో ఖ్యాతి సంపాదించుకుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ లో నిర్మించారు. ఇలా చిరంజీవి జీవితం ఎన్నో మైలు రాళ్లు దాటుకుని ఈ స్టేజికి నిలబడింది.

    ఇప్పటికి కూడా చిరంజీవి జీవితం ఓ తెరిచిన పుస్తకమే. ప్రారంభ దశలో క్యారెక్టర్ ఇవ్వడానికి చాలా మంది నిరాదరణకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో కళామతల్లిని నమ్ముకుని ఎన్నో వ్యయప్రయాసలకు గురయ్యాడు. ఒక్కో సినిమాను చాలెంజ్ గా తీసుకుని ముందుకు నడిచారు. ఈ క్రమంలో చిరంజీవి పాత్రల ఎంపికలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి హిట్లు సాధించాడు.

    నేడు చిరంజీవి పుట్టిన రోజు. ఇప్పటికి 68 సంవత్సరాలు ఉన్నా కుర్రాళ్లకు పోటీగా నిలుస్తున్నాడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో రాణించాలని అనుకున్నా కలిసి రాలేదు. తిరిగి మళ్లీ సినిమాల్లో నటించడానికి నిర్ణయించుకున్నాడు. తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. దీంతో చిరంజీవి యుగానికి ఒక్కడు అనే నినాదం వస్తోంది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...