33.2 C
India
Sunday, May 19, 2024
More

    SL vs Pak Asia Cup 2023 : ఉత్కంఠ పోరులో పాక్ ఓటమి.. ఫైనల్ కు శ్రీలంక

    Date:

    Pakistan vs Sri Lanka, Asia Cup 2023 Highlights
    Pakistan vs Sri Lanka, Asia Cup 2023 Highlights

    SL vs Pak Asia Cup 2023 :
    ఆసియా కప్ లో ప్రస్తుతం సూపర్ 4 మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే టీమిండియా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. బంగ్లాదేశ్ ఇంటి దారిపట్టింది. ఇక ఫైనల్ కు చేరుకునే మరో జట్టు కోసం గురువారం శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠ పోరులో శ్రీలంక రెండు వికెట్లతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది.

    కాగా తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ వర్షం అంతరాయం కారణంగా 45 ఓవర్లలో  ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆఖరి బంతికి శ్రీలంక ఛేదించింది. ఇక పాకిస్థాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 86 పరుగులు చేశాడు. 76 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఆయన టాప్ లో నిలిచాడు. ఇక ఇఫ్తికర్ అహ్మద్ కూడా 47 పరుగులు చేశాడు. ఇక 42 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ కుశాల్ పెరీరా త్వరగా ఔటయ్యాడు. క్రీజులో ఉన్నంత సేపు మాత్రం దడదడ లాడించాడు. కేవలం 8 బంతుల్లో 17 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇక శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్ జట్టును గెలుపు అంచున నిలిపాడు. ఆయన 91 పరుగులు చేశాడు. 87 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ తో ఈ పరుగులు రాబట్టాడు. ఆయనకు సదీర సమరవిక్రమ తోడయ్యాడు 49 బంతుల్లో 47 పరుగులు చేశాడు.

    వీరిద్దరి భాగస్వా్మ్యం వంద పరుగులు. ఇక వీరిద్దరూ ఔటయ్యాక శ్రీలంక మరింత తడబడింది. కానీ చరిత్ అసలంక ఆఖరి వరకు పోరాడాడు. 47 బంతుల్లో 49 పరుగులు చేశాడు. ఆఖరి బంతికి రెండు పరుగులు తీసి శ్రీలంకను గెలిపించాడు. ఫైనల్ ముంగిట నిలిపాడు. ఇక ఆసియా కప్ ఫైనల్ లో టీమిండియా, శ్రీలంక తలపడనున్నాయి. ప్రపంచకప్ కు ముందు ఈ కప్ రెండు జట్లకూ ప్రతిష్టాత్మకమే.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Zealand Vs Pakistan : పాకిస్థాన్ పై న్యూజిలాండ్ ఘన విజయం

    New Zealand Vs Pakistan : న్యూజిలాండ్, పాకిస్థాన్ ల మధ్య...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Imran khan : పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులదే గెలుపు

    Imran khan : పాకిస్తాన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది....