Imran khan : పాకిస్తాన్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. పాకిస్తాన్ ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) బలపరచిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో విజయం సాధించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పీఎంఎల్-ఎన్ పార్టీ 75 సీట్లు గెలుచుకుంది. బిలావర్ జర్దారీ భుట్టోకు చెందిన పీపీపీకి 54 సీట్లు వచ్చాయి.
ఎంక్యూఎం-పీ పార్టీకి 17 సీట్లు లభించాయి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉన్నాయి. 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరిగాయి. మిగతా 70 స్థానాలను మైనార్టీలు, మహిళలకు కేటాయిస్తారు. ఒక స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అనంతరం 264 స్థానాల ఫలితాలు విడుదల చేశారు.
పంజాబ్ లోని ప్రావిన్స్ లోని ఎన్ఏ 88 సీట్లు దక్కించుకుంది. పంజాబ్, సింధ్, ఖైబర్-పఖ్తుంక్వా ప్రావిన్సుల అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. బలూచిస్తాన్ లో మూడు నియోజకవర్గాల ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 133 సీట్లు గెలవాలి. దీంతో పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది.
పీఎంఎల్ ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ ఇతర పార్టీలతో చర్చిస్తున్నారు. నవాజ్ కు అనుకూలంగా సైన్యాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ కూడా రంగంలోకి దిగి పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్ని కలిసి రావాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని అందరు ఆసక్తిగా చూస్తున్నారు.