32 C
India
Sunday, June 30, 2024
More

    Pawan Kalyan-Chiru-PM Modi : చిరును ప్రధాని మోదీకి పరిచయం చేసిన పవన్ కల్యాణ్.. భావోద్వేగంతో రాంచరణ్ కన్నీళ్లు

    Date:

    Pawan Kalyan-Chiru-PM Modi
    Pawan Kalyan-Chiru-PM Modi

    Pawan Kalyan-Chiru-PM Modi : చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. వేదికపై ప్రధాని మోదీ అందరినీ పలకరించారు. మోదీ ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి కార్యక్రమానికి వచ్చిన అతిథులను కలిసి మాట్లాడారు. ముందుగా పవన్ కల్యాణ్ ప్రధాని మోదీ వద్దకు వచ్చి చిరంజీవి తన అన్నయ్య అని ఒక్కసారి మాట్లాడాలని కోరాడు. దానికి ప్రధాని మోదీనే ఏకంగా చిరు వద్దకు వెళ్లాడు. తనను పరిచయం చేసుకున్నాడు.

    మోదీ పవన్ కల్యాణ్, చిరంజీవితో కలిసి స్టేజీపైనే అభివందనం చేశారు. దీంతో  జనం కేరింతలు, చప్పట్లతో సభా ప్రాంగణం మారు మోగిపోయింది. అనంతరం చిరంజీవితో మోదీ మాట్లాడారు. ఆ సమయంలో చిరంజీవి బావోద్వేగానికి లోనయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన రజినికాంత్ దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వంతో ముచ్చటించారు.

    బండి సంజయ్, నితీన్ గడ్కరీ, ప్రపుల్ పటేల్, జేపీ నడ్డా, వెంకయ్యనాయుడు,ఎంపీలు సీఎం రమేశ్, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు అందరి వద్దకు వెళ్లి పలకరించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ మాత్రం స్టేజీపైనే మోదీతో మాట్లాడుతున్న సమయంలో స్టేజీ కింద ఉన్న రాంచరణ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రాంచరణ్ తండ్రిని చూసి బావోద్వేగానికి లోనయ్యారు.

    చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. సుప్రీం కోర్టు మాజీ జస్టిస్ ఎన్ వీ రమణ కూడా కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. దీంతో ఏపీలో అభివృద్దికి బాటలు పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి క్యాబినెట్ హోదా మంత్రిగా రామ్మోహన్ నాయుడుకు పౌర విమానాయాన శాఖ అప్పగించారు. ఏపీలో అమరావతి, వైజాగ్, గన్నవరం ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేసే అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే అవకాశం ఉంది. దీంతో అమరావతికి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పని చేయనున్నారు.

    Share post:

    More like this
    Related

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    Suryakumar Yadav : కప్పు తెచ్చిన క్యాచ్.. కపిల్ ను గుర్తు చేసిన సూర్య

    Suryakumar Yadav : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Chandrababu : ఆడపిల్లల తల్లిదండ్రులకు చంద్రన్న వరం.. ఒకేసారి అకౌంట్లలోకి రూ. 1.5 లక్షలు!

    CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ...

    IAS Officer : పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్!

    Dynamic IAS Officer : పదేళ్ల పాటు ఎన్నో అవమానాలు, విమర్శలు...