Payal Ghosh :
మీటూ ఉద్యమం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఈ ఉద్యమం సర్దుకున్న కూడా అప్పుడప్పుడు కొంతమంది నటీమణులు చేసే కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. హీరోయిన్స్ ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తూ నెట్టింట ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నారు..
ఇక మరో స్టార్ హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్స్ చేసి నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచింది. తాజాగా బెంగాలీ బ్యూటీ పాయల్ ఘోష్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్ వంటి సినిమాలతో మెప్పించిన పాయల్ ఘోష్ అందరికి తెలుసు..
ఆ తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు.. దీంతో సీరియల్స్ లో కూడా నటించింది. అయితే అమ్మడి లక్ బాలేక ఇక్కడ కూడా అవకాశాలు రాలేదు.. కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. ఈమె బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది..
ఇక తాజాగా ఈమె మరోసారి అనురాగ్ కశ్యప్ మీద ఫైర్ అయ్యింది. ఈయన నన్ను మూడవ మీట్ లోనే రేప్ చేసాడు అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.. ఛాన్సుల కోసం ఆయన దగ్గరికి వెళ్లగా అసభ్యంగా ప్రవర్తించాడని నన్ను రేప్ చేశాడంటూ చేసిన ట్వీట్ సంచలనం అయ్యింది.. మరి దీనిపై ఈయన స్పందన ఏంటో చూడాలి.