
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అమితంగా ఇష్టపడే హీరోయిన్ పాయల్ ఘోష్ తాజాగా సోషల్ మీడియాలో సూసైడ్ లెటర్ పోస్ట్ చేసి కలకలం సృష్టించింది. పాయల్ ఘోష్ తాజాగా చేసిన పోస్ట్ లో ఏముందంటే ……. ఒకవేళ నాకు గుండెపోటు వచ్చినా ……. ఆత్మహత్య చేసుకొని మరణించినా అందుకు కారణం ఎవరంటే ……. అని సగం రాసిన పోస్ట్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. ఏమైంది .పాయల్ ……. వెంటనే హాస్పిటల్ కు వెళ్ళు ……. బాగానే ఉన్నావా ? దయచేసి ఇలాంటి ఆలోచనలను దగ్గరకు రానీయకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో దర్శకుడు , నటుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది పాయల్ ఘోష్.
తెలుగులో ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ” ఊసరవెల్లి ” అనే చిత్రంలో నటించింది. తమన్నా హీరోయిన్ కాగా పాయల్ ఘోష్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ తో పరిచయం కావడంతో అతడికి అభిమానిగా మారిపోయింది. ఎన్టీఆర్ లోని స్పార్క్ చూసిన పాయల్ అప్పట్లోనే గ్లోబల్ స్టార్ అవుతాడని చెప్పింది. ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్ సంచలనం సృష్టించడంతో నేను అప్పుడే చెప్పాను గుర్తుందా ….. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
కట్ చేస్తే ఇప్పుడు సూసైడ్ నోట్ పెట్టి ఇలా సంచలనం సృష్టించింది. గతకొంత కాలంగా పాయల్ ఘోష్ సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతోంది. అలాగే అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతోంది పాపం.
View this post on Instagram