People of AP : చంద్రబాబు అరెస్టుతో వైసీపీ నాయకులు, ముఖ్యంగా సీఎం జగన్ రాక్షసానందం పొందుతున్నారు. జగన్ తన పేటీఎం బ్యాచ్ తో చంద్రబాబును దోపిడీ దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏపీ ప్రజలకు ఇప్పడు స్పష్టంగా అర్థమవుతుంది. ఏ పన్నలు లేకుండా సంక్షేమాన్ని అందించిన చంద్రబాబు గురించి, ఇచ్చిన దానికి రెండింతలు ముక్కు పిండి వసూలు చేస్తున్న జగన్ పాలన గురించి తెలిసి వస్తున్నది. ఇటీవల పవన్ కల్యాణ్ కు ఓ లారీ డ్రైవర్ టాక్సులే ఇందుకు ఉదాహరణ.
ఏపీ సీఎం జగన్ పాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిందే. జగన్ను ఇంటికి పంపించాలనే కసి అందరిలోనూ మొదలైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్ స్కీములు 83 రద్దుచేశారు. బీసీల స్కీములు 27, ఎస్సీ 29, ఎస్టీ 17, మైనార్టీ 10 రద్దుచేశారు. ఆక్షేపించారు. తెలుగుదేశం పై అక్కసుతోనే పేదల స్కీముల రద్దు అని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలంతా జగన్ బాధితవర్గాలుగా మారుతున్నాయి.
రాష్ర్టంలో ఆయా వర్గాల్లో సైలెంట్ రివల్యూషన్ మొదలైంది. కేసుల భయంతో ఎవరూ బయట పడడం లేదు. ప్రస్తుతానికి మమౌనమే సమాధానమవుతున్నది. వైసీపీలో ఉన్న నేతలంతా సమయం కోసం ఎదురు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా అని కాచుక్కూర్చున్నారని విమర్శించారు. జగన్ తో ఖజానా ఖాళీ: జగన్ పాలన దోపిడీకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. భూములు, గనులు, ప్రాజెక్టులు, చివరికి స్కీముల్లోనూ దోపిడీ కి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆస్తిని వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ దోచేయడంవల్లే ఖజానా ఖాళీ అవుతుందనే అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఖజానా ఖాళీ ఘనత జగన్ దేనని ప్రజలు భావిస్తున్నారు.
చంద్రబాబు అనగానే ఐటీ అభివృద్ధి, ఈ-గవర్నెన్స్, సంస్కరణల గుర్తొ్స్తాయి. కానీ రైతు సంక్షేమానికి వ్యవసాయరంగంలో కూడా కీల మార్పులు తీసుకొచ్చారు. వ్యవసాయానికి నీరే ప్రాణం. అటువంటి నీటిపారుదల రంగంలో సాగునీటి సంఘాల ఏర్పాటు విప్లవాత్మకమైన మార్పులు చేసి చూపారు. నీటిపారుదల వ్యవస్థపై రైతులకే అధికారాన్ని, బాధ్యతలను అప్పగించారు. రైతుల నీటిపారుదల నిర్వహణా చట్టాన్ని తీసుకువచ్చి… సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించి… 10,292 సాగునీటి సంఘాలను జూన్ 1997 నుంచి పనిచేయించారు చంద్రబాబు. ఈ సంఘాలకే చెరువుల మరమ్మతు పనులు అప్పగించారు.
కరవును పారదోలి బంజరు, బీడు భూములను ససైశ్యామలంగా మార్చేందుకు నీటి నిల్వ (వాటర్ షెడ్) కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసిన వాటర్ షెడ్ కార్యక్రమంతో అటు గ్రామీణులకు ఉపాథి అవకాశాలు పెరిగాయి, ఇటు 100 లక్షల హెక్టార్ల భూమి అభివృద్ధిలోకి వచ్చింది. ‘నీరు-మీరు’ కార్యక్రమ ప్రభావంతో భూగర్భజలాలు పెరిగాయి.
చంద్రబాబు పాలనలో రూ.8865 కోట్లతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఫలితంగా 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి కల్పన జరిగింది. మరో 18 లక్షల ఎకరాలు స్థిరీకరించబడ్డాయి. శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ, శ్రీరామ్ సాగర్ మొదటి రెండు దశలు, తెలుగు గంగ, ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ, ప్రియదర్శిని జూరాల, వెలిగొండ, గాలేరు నగరి, హంద్రీనీవా, నెట్టెంపాడు వంటి 18 మధ్య తరహా, 85 చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. 136 ఎత్తిపోతల పథకాలు చేపట్టి 1,93,800 ఎకరాలను సాగు కిందికి తెచ్చారు. తెలంగాణలో సూక్ష్మ సాగు సత్ఫలితాలను ఇచ్చింది.
రైతుమిత్ర సంఘాలను ఏర్పాటు చేసి సుమారు 3 లక్షల మందికి రైతులకు శిక్షణను ఇప్పించారు. సాగుపై అవగాహన పెంచడంతో పంట ఉత్పత్తి పెరిగింది. రైతుబంధు పథకం కింద అన్నదాత తాను కష్టపడి పండించిన పంటకు తగిన ధర పలికే వరకు గోదాముల్లో నిల్వచేసుకోవచ్చు. పైగా పంట విలువలో 75 శాతం ఋణం తీసుకోవచ్చు. ఈ రుణానికి 90 రోజుల వరకు వడ్డీ కట్టక్కర లేదు.
రైతు బజార్లు అంటేనే గుర్తు వచ్చేది చంద్రబాబే. రాష్ట్రవ్యాప్తంగా 58 పురపాలక సంస్థలు, 7 నగరపాలక సంస్థల పరిధిలో 107 రైతు బజార్లను ఏర్పాటు చేసారు. దళారులు లేకుండా తమ ఉత్పత్తులను వినియోగ దారునికి నేరుగా అమ్ముకునే విధంగా రైతు కోసం ఏర్పాటు చేసిన ఈ రైతు బజార్ల మూలంగా రైతుకు 20 శాతం ఎక్కువ ఆదాయం వచ్చేది. అలాగే వినియోగదారునికి 20 శాతం తక్కువకి ఉత్పత్తులు దొరికేవి.
ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు హైద్రాబాదు, రెడ్ హిల్స్ ప్రాంతంలో ఉద్యాన సాగు శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు చంద్రబాబు. తద్వారా హైద్రాబాదులో ద్రాక్ష పంటను బాగా ప్రోత్సహించారు. అలాగే బిందు సేద్యం, సూక్ష్మ సాగు పద్దతులను ప్రోత్సహించి రైతుకు అండగా నిలిచారు.
ఇక మహిళా సంఘాలు ఎంతటి విప్లవాన్ని సాధించాయె చెప్పనక్కర లేదు. పాలనలో చంద్రబాబు తనదైన ముద్ర వేశారు. ప్రతి రంగాన్ని ప్రగతి పథంలో నడిపించారు.