25.3 C
India
Tuesday, July 16, 2024
More

  Jana Sena & TDP : ఇప్పుడు పొలిటికల్ గేమ్ జనసేన చేతిలో..టీడీపీ తలొగ్గక తప్పని పరిస్థితి..?

  Date:

  Now the political game is in Jana Sena's hands.
  Now the political game is in Jana Sena’s hands.

  Jana Sena & TDP :

  రాజకీయాల్లో పవన్ కల్యాణ్ స్టాండ్ సరిగా లేదన్న వారికి జనసేన అధినేత సమాధానం చెప్పబోతున్నాడా అంటే ఔననే టాక్ బయటికి వస్తుంది. 2014లో బీజేపీ, టీడీపీ మద్దతు, 2019 లో ఒంటరి పోరు, నిలబడిన రెండు చోట్ల ఓటమితో రాజకీయంగా పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత మళ్లీ సినిమాల మీద దృష్టి సారించారు. మళ్లీ అంతలోనే బీజేపీతో అలయన్స్, అడపాదడపా జనసేన కార్యక్రమాలు తప్ప బయటికి పెద్దగా వచ్చిందేమీ లేదు. ఒక్కసారిగా వారాహి యాత్రతో దూకుడు పెంచాడు పవన్.  మళ్లీ మధ్యలో సినిమాలు, ఇటు వారాహి యాత్రతో రెండు వైపులా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. దీంతో మళ్లీ విమర్శల పాలవుతున్నాడు.
  వారం నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ పొలిటిల్ రూట్ లో మార్పులు చేసినట్లు తెలుస్తున్నది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. టీడీపీతో నే తన ప్రయాణం అని జనసేన అధినేత ప్రకటించాడు. ఇందుకు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తున్నది.
  ఏపీ రాజకీయాల్లో పవన్ ప్రాధాన్యత పెరుగుతున్నట్లు కనిపిస్తున్నది. పార్టీ పెట్టిన పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్‌ రాజకీయంగా విమర్శలే తప్ప సాధించింది పెద్దగా ఏమీలేదు. పార్ట్ టైమ్ పొలిటిషన్ అని అపవాదును మూటగట్టుకున్నాడు.  2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా ఓటమి పాలయ్యాడు. ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలు, వ్యంగ్యస్త్రాలు రాజకీయంగా పవన్ కళ్యాణ్‌ను రాటు దేలేలా చేశాయి.
  ఓటు చీలనివ్వను..
  ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ కొద్ది రోజులుగా పవన్ పదే పదే చెబుతున్నాడు. అప్పటికే బీజేపీతో జట్టు కట్టిన పవన్‌కు మాటల్లో స్పష్టత లేదని అందరూ భావిస్తూ వచ్చారు. 2019 ఓటమిని విశ్లేషించుకున్న పవన్ కు క్లారిటీ వచ్చింది.విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్‌ పర్యటనను అడ్డుకోవడంతో  జనసేన-టీడీపీల మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. పవన్ కల్యాణ్‌కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ నోవాటెల్‌ హోటల్లో పరామర్శించారు. ఆ తర్వాత చంద్రబాబుతో హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్‌ భేటీ అయ్యారు. అయితే పొలిటికల్ అలయన్స్ గురించి మాత్రం వారిద్దరూ ఎక్కడా ప్రస్తావించలేదు.  ఓ వైపు బీజేపీతో ఉంటూనే టీడీపీని కూడా తమతో కలుపుకోవాలని పవన్ చూస్తున్నాడని వైసీపీ విమర్శలు గుప్పిస్తున్నది. 2019 ఎన్నికల్లో 40శాతం ఓట్లు దక్కించుకున్న టీడీపీ, 6శాతం ఓట్లకు పరిమితమైన జనసేనతో పొత్తు కుదరకపోవచ్చని అందుకే పవన్ బీజేపీ వెంట నడుస్తున్నారని అందరూ అనుకున్నారు.
  చంద్రబాబు అరెస్టుతో..
  చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు ఎప్పటి వరకు జైల్లో ఉండాల్సి వస్తుందనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతన్నది. చంద్రబాబు జైలుకు వెళ్లిన వెంటనే ములాఖత్‌లో ఆయన్ని పరామర్శించారు. బయటకు రాగానే టీడీపీ-జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్‌ ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారు.  ఇప్పుడు తమ పార్టీకి ఎన్ని సీట్లు ఎక్కడ కావాలో అనే విషయంపై పవన్ కళ్యాణ్ కు క్లారిటీ వచ్చింది. చంద్రబాబు తర్వాత టీడీపీని ముందుండి నడిపించే నాయకుడెవరు కనిపించడం లేదు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ను కూడా అరెస్ట్‌ చేస్తారని టీడీపీలో అనుమానాలు మొదలయ్యాయి. అదే జరిగితే టీడీపీ-జనసేన కూటమిని ఎన్నికలకు నడిపించాల్సిన బాధ్యత కూడా పవన్ ‌కళ్యాణ్‌ అనే భావన వెల్లడవుతున్నది. నిన్న మొన్నటి వరకు టీడీపీ ఇచ్చిన సీట్లతో సర్ధిపెట్టుకోవాల్సి ఉంటుందనే పరిస్థితి నుంచి తాన కోరిన సీట్లన్నీ దక్కించుకునే వ్యూహంలో పవన్ ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం పవన్ డిమాండ్లకు టీడీపీ తలొగ్గక తప్పని పరిస్థితి.
  బీజేపీ ప్రమేయమేనా?
  జనసేన-టీడీపీ-బీజేపీల మధ్య నడుస్తున్న రాజకీయాలను గమనిస్తే ఏపీ రాజకీయ పరిణామాలపై బీజేపీ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నదా లేక తెరవెనుక పావులు కదుపుతున్నది ఆ పార్టీ పెద్దలేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ మూవ్ మెంట్ పై అనుమానాలు కలుగుతున్నాయి. 2024కి కాకపోయినా 2029కల్లా తమకంటూ కొంత బలాన్ని ఏర్పరచుకునేందుకు తమిళనాడు సహా ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రయత్నిస్తున్నదనే సందేహాలు కలుగుతున్నాయి.  ఒక్క శాతం ఉన్న తమ ఓటుకు ఆరు శాతం ఉన్న పవన్ కల్యాన్ పార్టీని జత చేసుకుని ఇప్పుడు దాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించడం బీజేపీ వ్యూహమైతే ఏపీ రాజకీయాలు మున్ముందు  మరింత రసవత్తరంగా ఉండొచ్చు. ఈ మొత్తం ఆటలో టీడీపీ భవిష్యత్ ఏమిటనేది కూడా చర్చనీయాంశమే.

  Share post:

  More like this
  Related

  Pawan : పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్.. లక్ష కోట్ల ఆదాయం ఉండే కంపెనీ కోసం పోరాటం!

  Pawan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం...

  CM Relief Fund : ఆన్‌లైన్‌లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు

  CM Relief Fund : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

  AP Government : వైసీపీ మెడకు మరో ఉచ్చు? ఏపీ సర్కార్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

  AP Government మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు...

  Anchor Rashmi : ఆ ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్.. మద్దతిచ్చిన నెటిజన్లు..

  Anchor Rashmi : యాంకర్ ‘రష్మీ గౌతమ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Vijayasai Reddy : విజయసాయిరెడ్డితో నాకే సంబంధం లేదు : దేవాదాయ శాఖ అధికారి శాంతి

  Vijayasai Reddy : వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై కొన్ని రోజులుగా వివాదం...

  Ayodhya : మొన్న అయోధ్య.. నేడు బద్రీనాథ్.. బీజేపీకి ఏమైంది!

  Ayodhya : ప్రజల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం నాయకులకు...

  YCP MLA : వైసీపీకి మరో షాక్.. టీడీపీ గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ?

  YCP MLA : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర...

  Vallabhaneni Vamsi : వ‌ల్లభ‌నేని వంశీ మిస్సింగ్‌.. సెర్చ్ ఆపరేషన్ షురూ

  Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ.. ఈ పేరుకి పరిచయం అవసరం...