Pooja Hegde :
పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇప్పుడు ఈమె ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఫేమస్.. తెలుగులో అట్టర్ ప్లాప్ సినిమాలతో ఐరెన్ లెగ్ అని పిలిపించుకున్న పూజా ఆ తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపొయింది..
కానీ ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.. ఏడాది కాలంగా పూజా హెగ్డేను దురదృష్టం వెంటాడుతుంది.. కెరీర్ బిగినింగ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ పడిందో మళ్ళీ ఇప్పుడు ఈమె కెరీర్ అలాంటి మలుపు తిరిగింది. వరుస ప్లాప్స్ తో కెరీర్ డీలా పడింది.. మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీలో ఈ భామనే ముందుగా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అందుకే ఈ సినిమాతో అయిన హిట్ అందుకుందాం అనుకుంటే అది కూడా చేజారి పోయింది.
త్రివిక్రమ్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా తీసుకుని ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా డిమోట్ చెయ్యడంతో ఈ భామ బాగా హార్ట్ అయినట్టు సమాచారం.. త్రివిక్రమ్ హ్యాండ్ ఇవ్వడంతో ఈ అవమానం భరించలేక తీసుకున్న అడ్వాన్స్ కూడా ఇచ్చేసి ఈ సినిమా నుండి పూజా పక్కకు తొలగింది.. దీంతో చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది.
ఈ క్రమంలోనే ఈ భామ ఆఫర్స్ లేక మానసిక సంఘర్షణకు గురి అవుతుంది అని ఆమె పెట్టె పోస్టులతో అర్ధం అవుతుంది. తాజాగా పూజా వైట్ బాడీ డ్రెస్ లో సెక్సీగా కనిపించింది. ఈ పిక్స్ షేర్ చేస్తూ ‘పీస్’ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఈమెకు మనశ్శాంతి కావాలని అది లేక బాధ పడుతుంది అని చాలా మంది అంటున్నారు. మొత్తానికి అమ్మడి కెరీర్ మళ్ళీ సందిగ్ధంలో పడిపోయింది.. చేతిలో ఒక్క ఆఫర్ లేక అల్లాడిపోతోంది..