29.5 C
India
Sunday, May 19, 2024
More

    Premium Cars : తక్కువ ధరలో ప్రీమియం కారు.. రీసేల్ కూడా ఎక్కువే.. ఆదేంటంటే?

    Date:

    Premium Cars
    Premium Cars

    Premium Cars : కార్లలో తిరగాలని చాలా మందికి ఉంటుంది. కానీ దాని మరమ్మతుకు అయ్యే ఖర్చు చూసి వాహన యజమానులు బెంబేలెత్తిపోతారు. కొందరు తరుచూ కార్లను మారుస్తుంటారు. ఈ క్రమంలో ఫలానా కంపెనీ కారు తీసుకొని తిరిగి అమ్మితే దానికి సరైన ధర వస్తుందా? అని సంశయిస్తారు. అలాంటి వారి కోసమే ఈ గుడ్ న్యూస్.

    ఈ కార్లు చాలా బెటర్
    మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీల కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఫీచర్లు, సీటింగ్ కెపాసిటీ,  మైలేజ్ తదితర వాటిని కొనుగోలుదారులు పరిగణనలోకి తీసుకుంటారు. కొందరైతే ఫలానా కారు తీసుకొని కొన్ని నెలలు గడువక ముందే అమ్మేస్తుంటారు. కానీ ధర తక్కువ వచ్చిందని బాధపడుతుంటారు. అలాంటి వారికి ఓ బెటర్ కారు ఆప్షన్ గా చెప్పవచ్చు.

    ధర తక్కవ.. రీ సేల్ వాల్యూ కూడా ఎక్కువే..
    భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ I20కి ఉన్న క్రేజ్ వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ కారు ప్రీమియం ఫీచర్లు, డిజైన్, ఇంజిన్ చాలా మందికి నచ్చుతుంది. ఇది టాటా కంపెనీకి చెందిన ఆల్టోజ్, మారుతి బెలానోతో పోటీ పడుతుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే రీసేల్ లో దీనికి మంచి ధర లభిస్తుంది.

    దీన్నే ఎందుకు అంటున్నామంటే..
    హ్యుందాయ్ I20 హ్యాచ్‌బ్యాక్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ కలిగి ఉంది. ఇది 83 PS పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలగి ఉంది. దీని ఆటోమేటిక్ వేరియంట్ 88 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది.కంపెనీ తన N-లైన్ వేరియంట్‌లో లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ను సైతం అందించింది. ఇది 120 PS శక్తినీ, 172 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

    ఇవీ ఫీచర్లు..
    10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. 7-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, USB టైప్-సీ ఫాస్ట్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇవన్నీ ఫీచర్లు ఈ కారులో అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రతా కోణానికి సంబంధించి కూడా ఇందులో ఫీచర్లు ఉన్నాయి. 6 ఎయిర్ బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ ఎంకరేజ్, ESC, ABS, హిల్ అసిస్ట్ కంట్రోల్, డే-నైట్ IRVM, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ప్రయాణికులందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్‌లతో ప్రామాణికంగా లభిస్తున్నాయి. వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు దీని సొంతం.

    ఎక్కడ పొందవచ్చు..
    సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో ఈ కారును పొందువచ్చు. ముఖ్యంగా OLX, Cars24, Spinny వంటి అనేక ఆన్‌లైన్ కార్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో సెకండ్ హ్యాండ్ i20ని కొనుక్కోవచ్చు. మొదటి, రెండో తరం i20ని లభిస్తాయి. ఈ కారు సెకండ్ హ్యాండ్ లో కొంటే లక్షలు ఆదా అయినట్లే.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related