25.4 C
India
Saturday, June 29, 2024
More

    Ramcharan’s Tweet : రాంచరణ్ ట్వీట్ ను వైరల్ చేస్తున్న బీజేపీ సోషల్ మీడియా.. ఎందుకంటే?

    Date:

    Ramcharan’s Tweet :

    మెగా పవర్ స్టార్ రాంచరణ్ మూడేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ బీజేపీ సోషల్ మీడియా టీం తాజాగా వైరల్ చేస్తుంది. తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి, సినీ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

    కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ హిందూవాదులు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో రాంచరణ్ ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత’ అంటూ చేసిన వీడియోను కొందరు ఇప్పుడు రీ ట్వీట్ చేస్తున్నారు.

    ప్రస్తుత పరిస్థితులు రాంచరణ్ వీడియో ఫర్ఫెక్ట్ గా సరిపోతుండటంతో హిందూవాదులు.. బీజేపీ సోషల్ మీడియా ఈ ట్వీట్ ను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. కాగా ఈ ట్వీట్ రాంచరణ్ 2020 సెప్టెంబర్ 11న తన ట్విటర్లో పోస్టు చేశాడు. రాంచరణ్ తల్లి సురేఖ కొణిదెల ఇంట్లో తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫొటోను రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ‘మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత’ అని నాడు పేర్కొన్నాడు.

    కాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పలువురు బీజేపీ నేతలు ఆయన చేసిన వ్యాఖ్యలపై కేసులు సైతం పడుతున్నారు. ఈ సంఘటనలపై ఉదయ్ నిధి స్టాలిన్ తాజాగా స్పందిస్తూ.. దేవుడు ఒక్కడే అనేది డీఎంకే విధానమని.. తాను కేవలం సనాతన ధర్మాన్ని మాత్రమే వ్యతిరేకించానని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తనపై ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తుందని వివరణ ఇచ్చారు.

    Share post:

    More like this
    Related

    KCR : కేసీఆర్ ను టెన్షన్ పెడుతున్న హైకోర్టు తీర్పు?

    KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు...

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. అంతా సురక్షితం

    International Space Station : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు...

    Yediyurappa : పోక్సో కేసును కొట్టివేయండి: యడియూరప్ప పిటిషన్

    Yediyurappa : పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టి...

    Jakkanna : జక్కన్న ఒకే ఒక సినిమాను రీమేక్ చేశాడు.. వందేళ్ల కిందటి ఆ సినిమా పేరు ఏంటంటే?

    Jakkanna : ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు టాలీవుడ్ కే కాదు.....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmi Viral Tweet : బీజేపీతో సమస్య ఉంటే నాతో గొడవెందుకు.. నెటిజెన్స్ రష్మీ వార్నింగ్..!

    Rashmi Viral Tweet : టాలీవుడ్ బుల్లితెర మీద యాంకరింగ్ తో సత్తా...

    Udayanidhi Stalin : ఉదయనిధి స్టాలిన్ పై నటి కస్తూరి ఫైర్.. మీ ఇంట్లో అలాగే చేస్తారా అంటూ..

    Udayanidhi Stalin : చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ లో డీఎంకే నాయకుడు...

    Jamili Elections : జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం?

    Jamili Elections : కేంద్రం ఈ సారి జమిలి ఎన్నికలకు వెళ్లాలని...

    Vanaparthi : వనపర్తిలో గెలుపెవరిది?

    Vanaparthi : బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జి చిన్నారెడ్డి బీజేపీ అభ్యర్థి త్రిముఖ...