28.5 C
India
Monday, July 1, 2024
More

    Rathika Breakup : పెళ్ళికి ముందే కండిషన్స్ పెట్టిన రాహుల్.. అందుకే రతిక బ్రేకప్ చెప్పిందా?

    Date:

    Rathika breakup
    Rathika breakup Reason with Singer Rahul

    Rathika Breakup Reason : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇప్పటికే ఎనిమిదవ వారం కూడా పూర్తి చేసుకుని తొమ్మిదవ వారంలోకి అడుగు పెట్టింది. రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్న ఈ షో పై ఆడియెన్స్ మరింత ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ వారం ఎండింగ్ కు వస్తుంది.. ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ కూడా రాబోతుంది.. నాగ్ ఈ రోజు ఎంట్రీ ఇచ్చి అందరికి క్లాస్ తీసుకో బోతున్నాడు.

    ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో రతికా రోజ్ ఒకరు.. ఈ సీజన్ లో ముందులో రతికా రోజ్ అందరి దృష్టిని ఆకర్షించి హైలెట్ అయ్యింది. ముందు నుండి ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన క్రేజ్ ను పెంచుకున్న ఈ భామ రోజులు గడిచే కొద్దీ మాత్రం చిరాకు కలిగించి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. కానీ ఈమెకు బిగ్ బాస్ మరో ఛాన్స్ ఇచ్చాడు.

    ఇదిలా ఉండగా ఈమె రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ స్టోరీ నడిపినట్టు వెలుగులోకి వచ్చింది.. ఈ విషయం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈమె రాహుల్ పేరు వాడుకుంటుందని రకరకాల ఆరోపణలు వచ్చాయి. తాజాగా రాహుల్ – రతికా లవ్ స్టోరీపై ఆమె సోదరి స్పందించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

    రాహుల్, రతిక కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో ఈమె కావాలనే లీక్ చేయించింది అంటూ తన ఫేమ్ ను వాడుకోవడం కోసం ఇలాంటివి బయటకు లీక్ చేసినట్టు రాహుల్ ఆరోపించిన విషయం తెలిసిందే.. ఈ కామెంట్స్ పై ఈమె స్పందిస్తూ ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో మాకు తెలియదు రాహుల్ నే లీక్ చేసాడని మేం అనుకున్నాం అంటూ చెప్పింది.

    ఆ ఫోటోలు ఉంటే రాహుల్ దగ్గర ఉండాలి.. లేదంటే రతికా దగ్గర ఉండాలి.. అలాంటప్పుడు బిగ్ బాస్ లో ఉన్న అక్క ఎలా లీక్ చేస్తుంది. తన ప్రైవేట్ ఫోటోలను లీక్ చేసుకుని తనని తాను బ్యాడ్ చేసుకుంటుందా అంటూ వివరించింది. వీరి లవ్ ను అందరు ఒప్పుకున్నారు.. పెళ్లి వరకు వచ్చాక గొడవలు జరిగాయి..

    పెళ్ళికి ముందే రాహుల్ కండిషన్స్ పెట్టాడట.. పెళ్లి తర్వాత నువ్వు ఇండస్ట్రీలో ఉండొద్దు.. బయటకు వెళ్ళడానికి వీల్లేదు.. అంటూ కొన్ని కండిషన్స్ పెట్టాడట.. అవి అక్కకు నచ్చలేదని అందుకే బ్రేకప్ అయిపోయింది అంటూ ఈమె చెప్పింది. ఇద్దరు అంగీకారంతో విడిపోయిన కూడా రాహుల్ పిక్స్ లీక్ అవ్వడం వెనుక రతిక ఉందని స్టోరీ పెట్టడంతో ఆమెకు చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. రతికకు చెడ్డ పేరు రావాలని కావాలనే ఇలా చేసారంటూ ఈమె చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related