28.5 C
India
Monday, July 1, 2024
More

    Rathika Rose : రతికా కన్నింగ్ స్టార్.. పాము కంటే డేంజర్.. నెటిజెన్స్ మీమ్స్ మామూలుగా లేవుగా!

    Date:

    Rathika Rose :
    బిగ్ బాస్ సీజన్ 7 నాలుగు వారాలు ముగిసి 5వ వారంలోకి అడుగు పెట్టింది.. 14 మంది  సభ్యులతో స్టార్ట్ అయినా బిగ్ బాస్ నాలుగు వారాల్లో నలుగురు ఎలిమినేట్ కావడంతో ఇప్పుడు 10 మంది మాత్రమే ఉన్నారు.. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని మూడు వారాల్లో బయటకు రాగా ఇప్పుడు 4వ వారంలో రతికా రోజ్ ను ప్రేక్షకులు బయటకు పంపించారు.
    హౌస్ లో ఎవరు ఫేక్ గా ఉన్నారో ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇస్తున్నారో వారిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులు ఉంచుతున్నారు.. దీంతో ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్స్ బయటకు వస్తున్నారు. రతికా అనుకోకుండా బయటకు వచ్చిన ఈమెను బయటకు పంపడం మంచిదే అని ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు..
    ఎందుకంటే ఈమె బిహేవియర్ హౌస్ లో అలా ఉంది. ఈ భామ మొదటి వారం అందరిని ఆకట్టుకోగా ఆ తర్వాత తాను చేసిన స్వయంకృతాపరాధం కారణంగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఒక్కసారి ఆడియెన్స్ కు ఈమె నెగిటివ్ గా ప్రొజెక్ట్ అయ్యాక ఎప్పుడెప్పుడు ఈమెను బయటకు పంపిద్దామా అని ఎదురు చూసారు..
    ఇప్పుడు 4వ వారంలో రతికా రోజ్ ను ప్రేక్షకులు బయటకు పంపించారు..ప్రశాంత్ కు కారణం లేకుండా హ్యాండ్ ఇవ్వడం, ఆ తరువాత యావర్ తో కూడా లవ్ ట్రాక్ నడిపినట్టే అనిపించి మళ్ళీ అతడిపై కూడా రివర్స్ అవ్వడం వంటివి ఈమె ఎలిమినేషన్ కు కారణం.. ఇక బయటకు వచ్చిన తర్వాత ఈమె బిగ్ బాస్ బజ్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.. గీతూ రాయల్ తన ప్రశ్నలతో రతికా రోజ్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది..
    ఈమె బాహుబలి లో కట్టప్పనే క్రాస్ చేశారు అనిపించింది అంటూ స్టార్ట్ చేసి ఒక ఆట ఆడుకుంది.. మీరు బాగా మానిప్యులేట్ చేస్తున్నారు అంటూ అనడంతో రతికా ఫేస్ వాడిపోయింది.. ఎక్స్ అనే పదాన్ని బాగా వాడినట్టు అనిపించింది.. వాడుకోవడం మీకు అలవాటు కదా అని అడిగింది. అంతేకాదు ప్రశాంత్ నీ వల్లనే సర్వైవ్ అవుతున్నాడా అని కూడా ప్రశ్నించింది.. అలాగే బయట ఈమెపై వచ్చిన మీమ్స్ ను కూడా చూపించింది.. ఈమెను కన్నింగ్ స్టార్ అని, ఫ్లిప్పింగ్ స్టార్ అంటూ బయట నెటిజెన్స్ ఎలా ఈమెను ట్రోల్ చేసారో కూడా చూపించింది.. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతుంది..

    Share post:

    More like this
    Related

    Rahul Gandhi : లోక్ సభకు శివుడి ఫొటోతో వచ్చిన రాహుల్.. అభ్యంతరం చెప్పిన స్పీకర్

    Rahul Gandhi : రెండు రోజుల విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభ...

    TGSPDCL : యాప్ ద్వారానే విద్యుత్ బిల్లులు చెల్లించాలి: టీజీఎస్పీడీసీఎల్

    TGSPDCL : విద్యుత్ వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ...

    Kalki Success Meet : కల్కి సక్సెస్ మీట్ ఎక్కడ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

    Kalki Success Meet : కల్కి 2898 ఏడీ కి సంబంధించిన...

    BRS KCR : బీఆర్ఎస్ ను నిలబెట్టాలని కొత్త వ్యూహాన్ని తెరపెకి తెస్తున్న కేసీఆర్

    BRS KCR : పదేళ్ల పాటు తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related