38.1 C
India
Saturday, May 11, 2024
More

    RGV tweet on Chandrababu : చంద్రబాబు కేసుపై ఆర్జీవీ ట్వీట్.. మరోసారి విరుచుకుపడిన వివాదస్పద డైరెక్టర్

    Date:

    RGV tweet on Chandrababu
    RGV tweet on Chandrababu

    RGV tweet on Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు 12 రోజుల రిమాండ్ ఏసీబీ కోర్టు విధించింది. ఇప్పటికే ఆయనను రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసు వైసీపీ ప్రేరేపితమని టీడీపీ ఆరోపిస్తుండగా, తమకేమి సంబంధం లేదని వైసీపీ కౌంటర్లు ఇస్తున్నది. అయితే చంద్రబాబు అరెస్ట్ ను మొదటి నుంచి ఆయన అభిమానులు ఖండిస్తూనే వస్తున్నారు. ఏదేమైనా ఏసీబీ తీర్పు ఏపీలో మాత్రం కలకలం రేపింది.

    కొంతకాలంగా చంద్రబాబు వ్యతిరేకిగా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, మరోసారి ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఆయన కొంతకాలంగా ఏపీ సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు మద్దతుగా సినిమాలు కూడా తీస్తున్నారు. ఇక చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో, ఆయనలో సంతోషం కట్టలు తెంచుకున్నట్లు ఉంది. ఆయన ట్వీట్లను చూసిన ప్రతి ఒక్కరికీ ఇదే అర్థమవుతుంది. జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరినీ తన సినిమాల్లో పాత్రలతో మరింత వేడి పుట్టిస్తున్నారు.

    అయితే రోజుకు రూ. 1.50 కోట్లు తీసుకునే చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రాను కేవలం నెలకు 1.50 లక్షలు జీతంగా తీసుకునే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే లాయర్ ఓడించాడని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.  నిజం అనేది మనీపవర్ కంటే గొప్పదని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. మీరు మనీ పవన్ తో న్యాయాన్ని వక్రీకరించవచ్చు అంటూ కామెంట్ చేశారు. దీనిపై పలువురు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    చంద్రబాబు మద్దతుదారులు రివర్స్ కౌంటర్ ఇస్తుంటే, వైసీపీ శ్రేణులు మెచ్చుకుంటున్నారు. గత కొంతకాలంగా ఆర్జీవీ వ్యవహార శైలి పూర్తిగా చంద్రబాబు, పవన్ లకు వ్యతిరేకంగా కొనసాగుతున్నదనే ప్రచారం నేపథ్యంలో మరోసారి ఆయన ట్వీట్లు దీనినే నిజం చేశాయి.

    Share post:

    More like this
    Related

    Car Brakes Fail : కారు బ్రెయిక్ ఫెయిల్ అయితే ఇలా చేయండి!

    Car Brakes Fail : కారు నడపడం అనేది ఒక నైపుణ్యం....

    RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై ఈసీకి ఫిర్యాదు

    RTC MD Sajjanar : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై...

    AP Mood : ఏపీ మూడ్ తెలిసిపోయిందిగా.. పోస్టల్ బ్యాలెట్లలో ఆల్ టైమ్ రికార్డ్

    AP mood : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వైఎస్సార్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారా..?...

    Crime News : ప్రేమికుడితో పాటు తానూ నిప్పంటించుకున్న యువతి

    Crime News : తన ప్రియుడు మరొకరికి దక్కకూడదని ఓ ప్రియురాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular