Sudheer-Rashmi : బుల్లితెరపై ప్రేమ జంట అంటే రష్మీ, సుధీర్ లదే. వారిద్దరు ప్రేమ ప్రయాణంలో ఎంతో దూరం వెళ్లారు. ఇటీవల కాలంలో సుధీర్ సినిమాల్లో బిజీగా ఉంటూ బుల్లితెరను పట్టించుకోవడం లేదు. దీంతో షోలు చప్పగా మారాయి. రష్మీ, సుధీర్ ఉంటేనే కార్యక్రమాలు పసందుగా ఉంటాయి. రంజుగా మారతాయి. వారి మధ్య కెమిస్ట్రీ అలా ఉంటుంది. నిజ జీవితంలో వారు ఒకటవుతారో లేదో తెలియదు కానీ షోల్లో మాత్రం వారి ప్రేమ అందరికి పసందుగానే ఉంటుంది.
తాజాగా ఈటీవీ 28వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన షోలో వీరిద్దరు ప్రేక్షకులకు కనువిందు చేశారు. వారి మాటలతో జోష్ నింపారు. ఇన్నాళ్లు ఎక్కడున్నావు అని రష్మీ అడిగితే నీ గుండెల్లోనే కదా అని సుధీర్ సమాధానం చెబుతాడు. దీంతో రష్మీ సుధీర్ గుండెలపై వాలుతుంది. ఇదంతా ప్రేక్షకులు చూసి ఫిదా అయ్యారు. నిజజీవితంలో వారు ఒక్కటయ్యే మార్గం కనిపించకున్నా షోల్లో మాత్రం ఇద్దరు భలే ప్రేమ పంచుతారు.
వీరి మధ్య జరిగిన సంభాషణలు వైరల్ అయ్యాయి. మేడం గారు కోపంగా ఉన్నారని సుధీర్ అడగ్గా నువ్వొస్తావని ఇన్నాళ్లు ఎదురు చూశాను అని చెప్పే డైలాగుతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వారి మధ్య జరిగిన కెమిస్ట్రీకి మురిసిపోయారు. బుల్లితెర వేదికగా వారి మాటలు అందరిని ఎంతో సంతోష పెట్టాయి. వీరి మధ్య మాటలను గుర్తు చేసుకుని మురిసిపోతున్నారు.
సుధీర్ మాటలకు రష్మీ సిగ్గుపడిపోవడం బాగుంది. వీరి రొమాంటిక్ సన్నివేశాలకు ఈటీవీ వేదిక అయింది. సుధీర్ రష్మీ అందమైన జంట అనేది నిర్వివాదాంశమే. వారి మధ్య కెమిస్ట్రీ బాగా పండుతుంది. వారిద్దరు ఎక్కడ కలిసినా వారి ప్రేమ కనువిందు చేయడం ఖాయమే. వారి మధ్య ప్రేమ నిజంగా ఉందో లేదో తెలియదు కానీ బుల్లితెర మీద వారి సన్నిహిత్యం తెగ ఎంజాయ్ చేస్తుంటారు.