
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ చూసిన గ్లామర్ మాత్రమే పని చేస్తుంది.. హీరోయిన్స్ ఎంత గ్లామరస్ గా ఉంటే అన్ని ఛాన్సులు అంటూ ఫిక్స్ అయ్యారు.. దీంతో చాలా మంది హీరోయిన్స్ కథ, కథనాలు, అలాగే తమ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంది అనే దాని కంటే రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు? అనే దానిపై ఫోకస్ చేస్తూ అందినంత పుచ్చుకుంటూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.
అయితే కథలో వారు నటించబోయే పాత్రలో ఎంత ప్రాధాన్యత ఉంది అనే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చే ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుని చాలా మంది అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న సాయి పల్లవి చేసింది కొన్ని సినిమాలే..
కానీ న్యాచురల్ అందంతో, సహజమైన నటనతో అందరిని మెప్పించింది. అలాగే డాన్స్ తో అందరిని ఫిదా చేసింది. పాత్ర నచ్చితేనే స్టార్ హీరో మూవీ అయిన ఒప్పుకుంటుంది అనే పేరు ఉంది.. అందుకే ఈమె ఇన్నేళ్లు అయినా కేవలం కొన్ని సినిమాలు మాత్రమే చేసింది.. అయితే చేసిన సినిమాలన్నీ కూడా ఈమె పేరును డబల్ చేసాయి..
ఇక ఇప్పటి వరకు సాయి పల్లవి సౌత్ వారినే మెస్మరైజ్ చేసింది.. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అని టాక్.. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సినిమాలో ఈమె హీరోయిన్ గా బాలీవుడ్ లో తెరంగేట్రం చేయబోతున్నట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ డైరెక్టర్ సునీల్ పాండే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు టాక్.. ఈ సినిమాలో హీరోయిన్ గా దాదాపు సాయి పల్లవి ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.. మొత్తానికి సాయి పల్లవి గట్టిగానే బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటుంది.. మరి సౌత్ వారి లాగానే నార్త్ ప్రేక్షకులను కూడా తన డ్యాన్స్ అండ్ నటనతో మెస్మరైజ్ చేస్తుందో లేదో చూడాలి..
ReplyForward
|