Sudigali Sudheer :
జబర్దస్త్ లో బాగా ప్రచారం పొందిన జంట అంటే సుడిగాలి సుధీర్, రష్మీలదే. జబర్దస్త్ లో వీరి జంట అందరిలో ఆసక్తి పెంచింది. వీరి జంట చూడ ముచ్చటగా ఉంటుంది. అందరు వీరు పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ వీరి జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారని భావించారు. కానీ వారు అనుకున్నది జరగలేదు. ప్రతి ఈవెంట్ లోనూ వీరి గురించే చర్చ.
సుడిగాలి సుధీర్ రష్మీ ఇద్దరు బుల్లితెర మీద సూపర్ స్టార్ గా ఎదిగారు. మెజీషియన్ గా కెరీర్ ప్రారంభించిన సుధీర్ జబర్దస్త్ లో తనదైన శైలిలో రాణించాడు. ఈటీవీ షోలో యాంకర్ గా విష్ణుప్రియతో కలిసి పోవేపోరాతో సందడి చేశారు. అయితే సుడిగాలి సుధీర్ ఇటీవల తనకు మరదలయ్యే ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని తెలిసింది.
మరదలు వరసయ్యే అమ్మాయితో సుధీర్ నిశ్చితార్థం చేసుకున్నాడనే వార్త ఇప్పుడు టోటల్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుధీర్, రష్మీ పెళ్లి చేసుకుంటారని అందరు ఆశించినా అదేం జరగలేదు. ఇప్పుడు బాధపడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కమెడియన్ గా కొనసాగుతూనే మరోపక్క హీరోగా నటిస్తున్నాడు.
సుడిగాలి సుధీర్ రష్మీల వివాహం అవుతుందని అనుకున్నా కుదరలేదు. ఈ క్రమంలో సుధీర్ రష్మీల వివాహం జరగదని తెలుస్తోంది. సుధీర్ తన మరదలును నిశ్చితార్థం చేసుకోవడంతో ఇక వారి వివాహం జరగడం కలే అని చెబుతున్నారు. సుధీర్, రష్మీలది నిజమైన ప్రేమ కాదని అప్పుడే పుట్టే ప్రేమా అభివర్ణిస్తున్నారు. ఇన్నాళ్లు మురిపించిన వారు పెళ్లి చసుకోకపోవడం ప్రేక్షకులను ఎంతగానో బాధించింది.