మ్యాజిక్ షోలతో క్రేజ్ సంపాదించుకున్న ఆయన ‘జబర్దస్త్’తో వేణు వండర్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఎదుగుతూ గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ తో టీం ఫాం చేశాడు. అదే ‘సుడిగాలి సుధీర్’. ఆ తర్వాత ఆయన టీమ్ పేరు సుధీర్ ఇంటిపేరుగా మారింది. కొన్ని రోజులు రష్మీతో లవ్ ట్రాక్ నడిపించి పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటూ డ్యాన్సర్‌గా, సింగర్‌గా ఆల్‌రౌండర్‌గా మారాడు.
సినిమాల్లోనూ రాణించి బుల్లితెరను కొంచెం దూరం పెట్టాడు. ఆయన హీరోగా ‘సాఫ్ట్వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’ చేసినా కాలిసి రాలేదు. కానీ, ‘గాలోడు’తో కెరీర్ బెస్ట్ హిట్‌ను సొంతం చేసుకొని రేంజ్ సంపాదించుకున్నాడు.
గాలోడు తర్వాత కాలింగ్ సహస్రలో కనిపించాడు. కానీ అనుకున్నంతగా సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు బిగ్ హిట్ కొట్టాలని ‘GOAT’తో రాబోతున్నాడు. ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓటీటీలో ‘ఫ్యామిలీ స్టార్స్’ షో చేస్తున్నాడు. దీంతో పాటు ఆహా ఓటీటీలో ‘సర్కార్ 4’ గేమ్ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఇది మంచి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఆహా ఓటీటీలో ‘సర్కార్ 4’ చేస్తున్నాడు. ఇందులో పదో ఎపిసోడ్ కోసం యాంకర్ స్రవంతి చోకారపు, బిగ్ బాస్ బ్యూటీ హమీదా, శోభా శెట్టి, శుభశ్రీ రాయగురు వచ్చారు. వీరితో కలిసి సుధీర్ సందడి చేశాడు. ఇందులో స్రవంతి సుధీర్ పై పంచుల వర్షం కురిపించింది. మిగిలిన వాళ్లు ఆడుకున్నారు.
‘సర్కార్ 4’ తాజా ప్రోమోలో సుడిగాలి సుధీర్‌పై హమీదా ప్రేమను కురిపిస్తూ షాక్ ఇచ్చింది. అతడిపై నాటీగా కామెంట్లు చేసింది. తరచూ స్టేజ్ మీదకు వెళ్లి సుధీర్‌కు హగ్గుల మీద హగ్గులు ఇచ్చేసింది. దీంతో వీళ్లిద్దరి ట్రాక్ హైలైట్ అయిపోయింది. ఫలితంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.