Deputy CM : యాదాద్రీశుడి సాక్షిగా దళిత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. యాదాద్రి దేవాలంలో పూజలు సంద్బంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కోమటి రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి పీటలపై కూర్చున్నారు.
డిప్యూటి సీఎం భట్టి మంత్రి కొండా సురేఖకు మాత్రం కాస్త ఎత్తు తక్కువ ఉన్న పీటలు వేశారు. దీంతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఐటీ సెల్ ఓ వీడియోను షేర్ చేసింది.
డిప్యూటి సీఎం గా దళిత నేతకు దక్కిన గౌరవం ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్య మంత్రి,ఆయన భార్య పైన కూర్చునప్పుడు డిప్యూటి సీఎం ను ఎందుకు కింద కూర్చో పెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ కాంగ్రెస్ పార్టీ నైజం అని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.