
QIQ Learning Academy : విద్యార్థులకు అవసరమయ్యే కోర్సులను ఆధునిక పద్ధతుల్లో అత్యంత తక్కువ ఫీజులతో అదించేందుకే క్యూఐక్యూ (QIQ) లెర్నింగ్ ఆకాడమీ ఏర్పాటైంది. న్యూజెర్సీలోని సౌత్ ప్లేయిన్‌ఫీల్డ్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆకాడమీని మేయర్ అనిష్.. కౌన్సిల్ మాన్ డేరిక్, కౌన్సిల్ మాన్ జోసెఫ్ సీ ఓలక్ తో కలిసి జనవరి 27వ తేదీన ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ అనిష్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన కోర్సులను అందిస్తూ, పేదలకు ఉచిత కోర్సులను బోధిస్తున్నందున ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం గౌరవప్రదంగా అందించే బోరగ్ బ్యాడ్జిని QIQ లెర్నింగ్ ఆకాడమీ ఫౌండర్ శ్రీకాంత్‌కు మేయర్ అనిష్ అందజేశారు. అకాడమీ ఏర్పాటుకు సహకరించిన విలాస్ జంబులకు కూడా బ్యాడ్జి అందజేశారు. సహకారం అందించిన వారిలో సందీప్ ఉన్నారు.
తెలుగు ఎన్నారైలు QIQ లెర్నింగ్ ఆకాడమీని ఏర్పాటు చేశారు. మిగతా ఆకాడమీల కంటే అతి తక్కువ ఫీజులకే అత్యున్నత, ఆధునిక పద్ధతుల్లో కోర్సులు అందిస్తున్నారు. అంతేకాదు పేద, మధ్య తరగతి వారికి కోర్సులు ఉచితంగా అందించనున్నారు.
QIQ లెర్నింగ్ ఆకాడమీ ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇస్తున్నట్లు ఫౌండర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ఆలోచనరేకెత్తించే విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని పెంపొందిస్తే విజయం సాధిస్తారని, అందుకు అనుగుణంగా తాము కోర్సులను రూపొందించినట్టు చెప్పారు. కోర్సుల వివరాల కోసం www.qiqlearningacademy.comలో చూడవచ్చని శ్రీకాంత్ తెలిపారు.
ఆకాడమీ నిర్వాహకులకు వేద పండితులు, సాయిదత్త పీఠం నిర్వాహకులు బ్రహ్మశ్రీ రఘు శంకరమంచి ఆశీర్వచనాలు అందజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా జైస్వరాజ్య అండ్ జైస్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్ Dr. శివకుమార్ ఆనంద్ పాల్గొన్నారు. అకాడమీ నిర్వాహకులకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ఎన్నారై సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.