26.1 C
India
Sunday, June 30, 2024
More

    Nilgiri Hills : నీలగిరి కొండల్లో దట్టమైన మంచుకు కారణాలేంటో తెలుసా?

    Date:

    Nilgiri Hills
    Nilgiri Hills

    Nilgiri Hills : వాతావరణంలో మార్పులు శరవేగంగా వస్తున్నాయి. తమిళనాడు ఊటీగా పేరుగాంచిన నీలగిరి కొండల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. దీంతో జనం అల్లాడుతున్నారు. చీకటైందంటే చాలు చలి మంటలు వేసుకుంటున్నారు. మంటల చుట్టే కూర్చుకుంటున్నారు. కాంతల్, తలైకుంట ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 1 డిగ్రీ సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. బొటానికల్ గార్డెన్ లో 2 డిగ్రీల సెల్సియస్, శాండినాల్లాలో 3డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది.

    వాతావరణంలో ఇలా మార్పులు రావడానికి గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో ప్రభావం వస్తున్నట్లు తెలుస్తోంది. నీలగిరి ఎన్విరోమెంట్ సోషల్ ట్రస్ట్ కు చెందిన శివదాస్ చలితీవ్రత మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధ్యయనాలు కూడా కొనసాగుతున్నాయి. డిసెంబర్ లో కురిసిన వర్షాల ప్రభావంతోనే చలి తీవ్రత పెరిగినట్లు భావిస్తున్నారు. దీని వల్ల పంటలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు.

    ఉదయం సమయంలో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. నీలగిరి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు జీరో డిగ్రీలకు పడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. వాతావరణ మార్పులపై పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత ఇంత భారీగా పెరగడం వల్ల వారికి ఏం చేయాలో తోచడం లేదు.

    గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో మార్పులు రావడం వల్ల రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చలి నుంచి కాపాడుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారు. మంచుతో కప్పబడి ఉంటున్నాయి. తేయాకు తోటలకు నష్టం కలుగుతోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Virat Kohli : టీ20లకు విరాట్ బైబై

    Virat Kohli : టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ టీ20...

    Shruti Hasan : శృతి బ్రేకప్ చెప్పింది అందుకేనా?

    Shruti Hasan breakup : యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి...

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...

    CM Revanth Reddy : వరంగల్ ను మరో హైదరాబాద్ చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy : హైదరాబాద్ తో సమానంగా వరంగల్ ను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Winter : శీతాకాలంలో ఎందుకు ఎక్కువ నిద్రపోతామో తెలుసా?

    Winter Sleep : ఈనేపథ్యంలో వేసవి కాలంలో రాత్రుళ్లు తక్కువగా పగటి...

    Global warming : మానవ తప్పిదాలతో కాలుష్య తీవ్రత.. భూతాపం మరింత పెరిగే ఛాన్స్..

    Global warming : ఏప్రిల్‌ చివరి వారాల్లో భారత్‌, థాయిలాండ్‌, బంగ్లాదేశ్‌,...