![Auspicious Moments](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/10/MARRIAGE.jpg)
Auspicious Moments : ఏ కార్యం చేపట్టాలన్నా మంచి రోజు, మంచి ముహూర్తం ఉండాల్సిందే. హిందూ ధర్మం ప్రకారం కొన్ని రోజులను శాస్త్రీయంగా మంచి రోజుగా పరిగణిస్తారు. ప్రతీ రోజూ మంచిదే అయినా పెద్ద పెద్ద శుభకార్యాలు నిర్వహించేందుకు తప్పనిసరిగా మంచి ముహూర్తాలు కావాల్సిందే. పెళ్లి, గృహ ప్రవేశం తదితరాలకు మాత్రం మంచి రోజులు తప్పనిసరి. అయితే 2024లో ఇలాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు పెట్టుకునేందుకు మంచి రోజులు చాలా తక్కువగా ఉన్నాయి. క్రోధి నామ సంవత్సరంలో తక్కువ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు.
ఇందులో భాగంగా రెండు నెలల నుంచి శుభముహూర్తాలు పెద్దగా లేవు. ఏదో ఒకటో, రెండో ముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. దీంతో మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి జూన్, జూలైలో కొంత వెసులుబాటు కలిగించింది శాస్త్రం. మూఢం, శున్యమాసం కూడా తోడవడంతో రెండు నెలలు పెళ్లి ముహూర్తాలు లేవు. ఈ నెల (జూన్) ఎండిగ్ నుంచి వచ్చే నెలలో కలుపుకొని ఆరు వరకు మంచి రోజులు ఉన్నట్లు పండితులు చెప్తున్నారు.
జూన్ 29వ తేదీతో పాటు జూలై 11, 12, 12, 14, 15 తేదీల్లో మంచి రోజులు, శుభ ముహూర్తాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ ముహూర్తాలు వెళ్లిపోతే ఆ తర్వాత చాతుర్మాసం వస్తుంది. ఇది వచ్చిందంటే ఆగస్ట్ నుంచి మొదలు అక్టోబర్ మూడు నెలలు శుభ ముహూర్తాలు లేవని, మళ్లీ నవంబర్, డిసెంబర్ లో ఉన్నాయని పండితులు చెప్తున్నారు. ఈ ముహూర్తాలను ఉపయోగించుకొని ఏ శుభకార్యాలైనా జరిపించుకోవచ్చని చెప్పారు.