Hero Nikhil : యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య డాక్టర్ పల్లవి ఉదయం (బుధవారం) మగ శిశువుకు జన్మనిచ్చింది. డాక్టర్ పల్లవిని 2020లో నిఖిల్ వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందు కొన్నేళ్లు వీరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ‘కార్తికేయ2’తో జాతీయ స్థాయిలో నిఖిల్ గుర్తింపు సంపాదించాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ సాగుతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ ప్రొడ్యూసింగ్ చేస్తున్న ద ఇండియా హౌజ్ లో కూడా నటిస్తున్నాడు.
తనకు మగ బిడ్డ జన్మించాడన్న సంతోషకరమైన వార్తను తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు నిఖిల్. ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకొని మద్దు పెట్టుకొని ఊయలలో పడుకోబెట్టడం లాంటి చిత్రాలను తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తోటి నటులు, సెలబ్రెటీల నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
వృత్తిపరంగా, నిఖిల్ ది ఇండియన్ హౌస్‌ని లైనులో ఉంచారు, దీనికి నూతన దర్శకుడు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించారు. వీ మెగా పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో నిఖిల్ అద్భుతంగా కనిపించబోతున్నాడు. హ్యాపీ డేస్ తర్వాత ఆయన ప్రయాణం చాలా ఇంట్రస్టింగ్ గా సాగింది.