దీంతో ఈ యువ హీరో ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాలు పాన్ ఇండియా రేస్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి నిఖిల్ లేటెస్ట్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘స్పై’.. ఈ సినిమా ఈ రోజు జూన్ 29న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ పడ్డాయి.. మరి ఈ ప్రీమియర్స్ తో అప్పుడే సందడి స్టార్ట్ అయ్యింది.
ఈ సినిమాను ప్రీమియర్స్ ద్వారా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ స్పై సినిమాను వార్తల్లో నిలిపారు. మరి వారి అభిప్రాయాల ప్రకారం ఈ సినిమా ఎలా ఉంది ? నిఖిల్ మరో హిట్ అందుకున్నాడా ? లేదంటే ప్లాప్ ఖాతాలో వేసుకోబోతున్నాడా? అనేది తెలుసుకుందాం..
యంగ్ హీరో నిఖిల్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ స్పై.. ఈ సినిమాతో మరోసారి నిఖిల్ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. బిహెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ప్రీమియర్స్ ను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. వారి రివ్యూలు ఒకసారి పరిశీలిద్దాం..
స్పై సినిమా లైన్ చాలా బాగుంది అని ఈ సబ్జెక్ట్ ను ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయలేదని అంటున్నారు.. దీంతో మిగతా ఆడియెన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ ను క్రియేట్ చేయడంలో సఫలం అయ్యారని.. నేతాజీ ఫైల్స్ చుట్టూ తిరిగే ఈ సినిమా కథ బాగా ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. అయితే క్వాలిటీ మరికాస్త పెంచినట్లయితే లొకేషన్స్ కు తగ్గట్టు విజువల్స్ మరింత అదిరిపోయేవి అని అంటున్నారు.
నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టే ఉన్నాయని నిఖిల్ తో పాటు మిగతా టీమ్ కూడా సపోర్ట్ చేసి ఉంటే ఈ సినిమా వేరే లెవల్ లో ఉండేదది ఈయన వన్ మ్యాన్ షో చేసినట్టు అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కంటెంట్ ఉన్న సినిమా కావడంతో హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి..
ReplyForward
|