21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Vijay Devera Konda Anasuya : ఇకపై వార్ వద్దు.. విజయ్ దేవరకొండతో వార్ ముగించిన అనసూయ

    Date:

    Vijay Devera Konda Anasuya : గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ అనసూయ భరద్వాజ్ మధ్య వార్ కొనసాగుతోంది. ట్విటర్, ఇన్ స్టా, ఇలా సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. కొన్ని సార్లు అనసూయ విజయ్ ఫ్యాన్స్ తో కూడా ఫైట్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆయన చేసిన ఫస్ట్ మూవీ కిస్ సీన్లపై తీవ్రంగా విరుచుకుపడింది అనసూయ. ఆ తర్వాత సోషల్ ఇష్యూస్ పై కూడా ఇద్దరు చాలా కాలం వాదులాడుకున్నారు. ఇక, తను ఈ వార్ ను ఆపేయాలి అనుకుంటున్నానని అనసూయ చెప్పారు. గతంలో విజయ్ తనకు మంచి స్నేహితుడని, కొన్ని పరిస్థితుల మధ్య ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయని చెప్పుకచ్చారు. ఈ మేరకు ఆమె ఒక ఇంగ్లిష్ పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

    ‘విజయ్ దేవరకొండతో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. ఇద్దరం మంచి స్నేహితులం. ఆయన హీరోగా చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో కొన్ని డైలాగులను సెన్సార్ బోర్డ్ మ్యూట్ లో పెట్టింది. ఈ సినిమా విడుదలైనప్పుడు థియేటర్లలో విజిట్ కు వెళ్లిన విజయ్ దేవరకొండ ఆడియన్స్ తో ఆ పదాలను పలికించాడు. ఒక తల్లిగా ఆ పదాలు నన్నెంతో బాధపెట్టాయి. ఇలాంటివి ప్రోత్సహించవద్దని ఆయనతో నేను చెప్పాను. ఇక అప్పటి నుంచి నాపై ఆన్ లైన్ ట్రోల్స్ మొదలయ్యాయి. కొంత కాలం చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత తేరుకున్న తనకు విజయ్ నిర్మించిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’లో  అవకాశం వచ్చింది. అందులో నటించాను.  అయితే, విజయ్ కు సంబంధించిన వ్యక్తే తనను ట్రోల్ చేసేందుకు కొందరికి డబ్బులు ఇస్తున్నాడని తెలిసి షాక్ కు గురయ్యాను. ఇదంతా విజయ్ కు తెలియకుండానే జరుగుతుందా.? అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో లేదో తెలియదు కానీ, ఈ వార్ ను ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నా’ అని ఆమె చెప్పారు.

    అనసూయ భరద్వాజ్ విజయ్ దేవరకొండ మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతుంది. అందుకే ఆమె తరుచూ విజయ్ ను ఉద్దేశించి పోస్ట్ లు పెడుతుంది. సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఖుషి’ ఈ సినిమా పోస్టర్ పై ‘ది విజయ్ దేవరకొండ’ అని ఉండడాన్ని ఆమె తప్పుబట్టారు. దీనిపై ఆమె వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఆమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయను ట్రోల్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...

    Vijay Devarakonda : డబుల్ యాక్షన్.. దిమ్మ తిరిగిపోయింది.. విజయ్ దేవరకొండ ఏం చేస్తాడో ఏమో

    Vijay Devarakonda : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ...

    Vijay – Rashmika : రౌడీబాయ్‌కి జోడీగా మరోసారి నేషనల్ క్రష్.. ఖుష్ లో ఫ్యాన్స్..

    Vijay Devarakonda - Rashmika : సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం...