Jailor : ప్రస్తుతం థియేటర్లలో రిలీజైన సినిమాల్లో భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నది రజనీకాంత్ నటించిన జైలర్. రెండు భాషల్లో ఒకే సారి ఈ సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. బీస్ట్ తో పారాజయం పాలైన దర్శకుడు నెల్సన్ జైలర్ తో భారీ హిట్ దక్కించుకున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాడు నెల్సన్. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ సినిమాలో ఒక పాత్ర కోసం టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణను తీసుకోవాలని అనుకున్నా. కానీ అది సాధ్యం కాలేదని చెప్పాడు.
‘రజనీకాంత్ ఉండగా మళ్లీ బాలకృష్ణ అంటే మల్టీ స్టారర్ సినిమా అవుతుందని కొందరు చెప్పారు. మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ రజనీకాంత్ తోనే తీయాలని అనుకున్నా.. కాబట్టి ఆయనవైపే ఎక్కువ మొగ్గు చూపించాల్సి వచ్చింది. ఇక ప్రత్యేక అట్రాక్షన్ గా మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ను ఎంపిక చేశాం. వీరు చేస్తుండడంతో మల్టీ స్టారర్ చిత్రం అనే కథనాలు చాలానే వినిపించాయి.
ఇందులో పోలీస్ పాత్ర కోసం బాలకృష్ణను అనుకున్నా. కానీ, కథానుగుణంగా ఆ క్యారెక్టర్ అంతగా ప్రాధాన్యం లేదు. అలాంటి పాత్రకు ఆయనను ఎంపిక చేయడం మంచిది కాదనిపించింది. అందుకే నా ప్రయత్నాన్ని విరమించుకున్నా. నటించేందుకు బాలయ్య బాబు అంగీకరించేవారో, లేదో తెలియదు కానీ, భవిష్యత్తులో ఆయనతో సినిమా చేయాలని మాత్రం ఉంది’ అని చెప్పాడు దర్శకుడు నెల్సన్.
యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ‘జైలర్’లో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. జాకీష్రాఫ్, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్, వసంత్ రవి, యోగిబాబు, మిర్నా మీనన్ లీడ్ రోల్స్ లో కనిపించారు. రజనీకాంత్ సినిమా గ్యాప్ రెండేళ్లు ఉండడంతో ఆయన అభిమానులు ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వారి అంచాలను దాటి ఈ సినిమా విజయం సాధించింది.